శ్రీ సిటీలోని 'టిల్ హెల్త్ కేర్' ఔషధ తయారీ పరిశ్రమలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 12 మందికి గాయాలయ్యాయి.
Sri City Fire Accident: శ్రీసిటీలో భారీ ప్రమాదం.. బాయిలర్ పేలడంతో నలుగురు మృతి.. వారి వివరాలు విడుదల
Tirupati Fire Accident | తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలోని ఓ కంపెనీలో బాయిలర్ పేలడంతో నలుగురు మృతిచెందగా, మరో 12 మంది కార్మికులు గాయపడ్డారని సమాచారం.

- శ్రీ సిటీలో బాయిలర్ పేలి ఐదుగురు కార్మికులు మృతిచెందారు.
- పన్నెండు మందికి గాయాలు కాగా, సహాయక చర్యలు ముమ్మరం అయ్యాయి.
- మృతుల్లో ఇతర రాష్ట్రాల కార్మికులు, వారి వివరాలు ప్రకటించారు.
- నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధితులకు అండగా నిలిచారు.
సత్యవేడు: శ్రీ సిటీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. బాయిలర్ పేలడంతో నలుగురు మృతిచెందగా, మరో 12 మంది కార్మికులు, సిబ్బంది గాయపడ్డారని సమాచారం. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం పరిధిలోని శ్రీ సిటీలో ఈ ప్రమాదం జరిగింది. శ్రీ సిటీలోని 'టిల్ హెల్త్ కేర్' (Till Healthcare) ఔషధ తయారీ పరిశ్రమలో శనివారం ఉదయం బాయిలర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది కార్మికులు, సిబ్బందికి గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో నైట్ షిఫ్ట్ విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికులు లోపలే చిక్కుకుపోయినట్లు సమాచారం. ఈ పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలు చేపట్టారు.

నారా లోకేష్ దిగ్భ్రాంతి..
శ్రీసిటీలోని ప్రైవేటు కంపెనీలో జరిగిన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని విద్య, ఐటీ శాఖల మంత్రి మంత్రి నారా లోకేష్ అన్నారు. బాయిలర్ పేలి కార్మికులు మృతి చెందడం, మరికొందరు గాయపడటం తీరని విషాదంగా పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు.

శ్రీసిటీ బాయిలర్ పేలుడు ఘటనలో మృతుల వివరాలు
బాయిలర్ పేలడంతో నలుగురు కార్మికులు మృతి
మృతుల్లో ముగ్గురు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు
రమేష్ (40) — మాదరపాకం, తమిళనాడు
గౌరబ్ రాయ్ (36) — పశ్చిమ బెంగాల్
చిన్న మస్తాన్ (36) — చెరివి గ్రామం
మోహన్ (20) — నాయుడుకుప్పం, తమిళనాడు
మరో కార్మికుడు వాసు (36) తీవ్రంగా గాయపడ్డాడు. అతడి స్వస్థలం తడ అని తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నై ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Frequently Asked Questions
శ్రీ సిటీలో జరిగిన ప్రమాదం ఏమిటి?
ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది?
ఈ ప్రమాదం తిరుపతి జిల్లా, సత్యవేడు మండలం పరిధిలోని శ్రీ సిటీలో చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన పరిశ్రమ పేరు ఏమిటి?
బాయిలర్ పేలుడు జరిగిన పరిశ్రమ పేరు 'టిల్ హెల్త్ కేర్' ఔషధ తయారీ పరిశ్రమ. ఇది శ్రీ సిటీలో ఉంది.
ఈ ప్రమాదంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంత మంది గాయపడ్డారు?
ఈ బాయిలర్ పేలుడులో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. మరో 12 మంది కార్మికులు మరియు సిబ్బంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు























