Varadaiya Palam Ashram Kalki Bhagawan: తిరుపతి జిల్లా : చాలా కాలం తరువాత ఇటీవల శ్రీ అమ్మ భగవాన్ యాక్టివ్ అయ్యారు. ఆశ్రమం తెరిచినట్లు ప్రకటించగానే కొన్ని రోజుల కిందట భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి వెళ్లి భగవాన్ ను దర్శించుకున్నారు. శ్రీ అమ్మ భగవాన్ (కల్కి ) పుట్టినరోజున వేడుకలను ఇక నుంచి ప్రపంచ ఏకత్వ దినోత్సవ పండుగగా నిర్వహించనున్నారు. ఇదే పేరుతో ప్రతి ఏడాది శ్రీ భగవాన్ పుట్టినరోజున వేడుకలు జరగనున్నట్లు ప్రకటించారు లోకేష్ దాసాజీ. సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలోని ఏకం ఆశ్రమం లో 7వ తేదీ జరగనున్న శ్రీ భగవాన్ పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లపై లోకేష్ దాసజీ మరియు ఉమాపతి దాసాజీ లు ప్రెస్ మీట్ నిర్వహించారు... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని కారణాల వల్ల మరియు ముఖ్యంగా కోవిడ్ కారణంగా ప్రతి సంవత్సరం జరిగే శ్రీ భగవాన్ పుట్టినరోజుని జరపలేని పరిస్థితులను అధిగమించి తిరిగి కల్కి ఆశ్రమం ప్రారంభిస్తున్నట్లు లోకేష్ దాసరి ప్రకటించారు.


మార్చి 7న (మంగళవారం) ప్రత్యేకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి దేశ, విదేశీ భక్తులు తోపాటు పలువురు ప్రముఖులు కూడా విచ్చేసే అవకాశం ఉందని అందులో ఐపీఎస్, ఐఏఎస్ లతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు వచ్చే అవకాశం ఉందని దాదాపు 30 వేల మంది పాల్గొనే విధంగా ఏర్పాటు చేశామని అందులో అధిక ప్రాధాన్యత ఇస్తూ స్థానికుల కు దాదాపు 2500 నుండి 3,000 మంది స్థానిక భక్తులు పాల్గొనే విధంగా ఏర్పాటు చేశామని... ఈ కార్యక్రమం సాయంకాలం 6 నుండి అర్ధరాత్రి ఒంటిగంట వరకు జరుగుతుందని ఇందులో శ్రీ అమ్మ భగవాన్ల (కల్కి )తో పాటు శ్రీ క్రిష్ణజీ శ్రీ ప్రితాజి కూడా దర్శనమిస్తారని ఉమాపతి దాసాజీ తెలిపారు.


వరదయ్యపాలెం మండలం లోని బత్తలవల్లం గ్రామంలో ఏకం టెంపుల్ నందు శ్రీ అమ్మా భగవాన్  (కల్కి ) 74 వ జన్మదిన సందర్బంగా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ లోకేష్ దాసాజీ ఆదివారం నాడు ఏకం టెంపుల్ నందు జరిగిన విలేకర్ల సమావేశం లో తెలిపారు. భారీ ఎత్తున ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి సేవకులను కూడా ఏర్పాట్లు చేసి భక్తులకు అన్నీ సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినీ, రాజకీయ వ్యాపార ప్రముఖులు విచేయనున్నారని.. వారికి అన్నీ సదుపాయాలు కల్పించి, వస భోజన సదుపాయలతో పాటు శ్రీ అమ్మా భగవాన్, కృష్ణజీ పితాజీలతో దర్శనం, దీక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ట్రస్ట్ ప్రతినిధి ఉమాపతి దాసాజీ తెలిపారు.


కల్కి భగవాన్‌పై ఎన్నో వివాదాలు ! 
తమిళనాడుకి చెందిన ఎల్ఐసీ ఏజెంట్ విజయ కుమార్.. కాలక్రమంలో కల్కి భగవాన్ అవతారం ఎత్తారు. తనతోపాటు, తన భార్య కూడా దైవాంశ సంభూతురాలిగా ప్రచారం చేసుకుంటూ వరదయ్యపాలెంలో ఆశ్రమం స్థాపించారు. ఆశ్రమానికి వచ్చే భక్తులకు బోధన చేస్తూ ధ్యానం చేయిస్తూ తనను కల్కి భగవాన్ గా, తన భార్యను అమ్మ భగవాన్ గా పూజించేలా ఏర్పాటు చేసుకున్నారు. ఆశ్రమానికి వచ్చేవారి వద్ద విరాళాలు సేకరిస్తూ వాటితో సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు. కల్కి పేరుతో చాలా చోట్ల సేవా సంఘాలు ఏర్పడ్డాయి. అన్నదానాలు, మెడికల్ క్యాంప్ లు.. ఒకటేంటి.. కల్కి పేరుతో చాలా కార్యక్రమాలే జరిగాయి. మెల్లగా ప్రచారం పెరిగింది. దింతో కల్కి ఆశ్రమానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగింది. పాదపూజ కోసమే లక్షలు వసూలు చేస్తారన్న పేరు ఉంది.