అన్వేషించండి

Viral News: చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని

Elephants Disrupt Traffic on Bhakarapet Ghat Road | తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు సంచారంతో గంటపాటు నిలిచిపోయిన ట్రాఫిక్‌ను ఎమ్మెల్యే పులివర్తి నాని చొరవతో అధికారులు పునరుద్ధరించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చంద్రగిరి భాకరాపేట ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు రోడ్డుపైకి చేరింది.
  • ఏనుగుల వల్ల గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
  • అంబులెన్సులను ప్రత్యామ్నాయ మార్గాలలో తరలించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
  • అటవీ, పోలీస్ అధికారులు ఏనుగులను అడవిలోకి తరలించి ట్రాఫిక్ పునరుద్ధరించారు.

Elephants Disrupt Traffic In Chandragiri | చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పరిధిలోని భాకరాపేట కనుమ రహదారిపై సోమవారం భారీ ఏనుగుల గుంపు ప్రత్యక్షమైంది. దట్టమైన అడవి నుంచి రోడ్డుపైకి వచ్చిన ఏనుగుల కారణంగా ఈ ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు సుమారు గంటపాటు పూర్తిగా స్తంభించిపోయాయి. రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఈ ఘటనపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తక్షణమే స్పందించారు. కనుమ రహదారిలో నిలిచిపోయిన వాహనాల్లో రెండు అత్యవసర అంబులెన్సులు కూడా ఉన్నట్లు స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ఆయన.. వెంటనే పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. రోగుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని, ఆ అంబులెన్సులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని పోలీసులను ఆదేశించారు.


Viral News: చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని

అదే సమయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే, అటవీ ప్రాంతం నుంచి ఏనుగులను సురక్షితంగా అడవిలోకి తరలించేలా చర్యలు చేపట్టమన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అటవీ, పోలీస్ శాఖల అధికారులు శ్రమించి ఏనుగుల గుంపును రహదారిపై నుండి దట్టమైన అటవీ ప్రాంతంలోకి విజయవంతంగా తోలేశారు. అనంతరం నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి రాకపోకలను పునరుద్ధరించారు.

Also Read: AP Rajya Sabha Elections: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?

రాత్రి వేళల్లో ప్రయాణికులకు, వాహన చోదకులకు ఎలాంటి అసౌకర్యం లేదా ప్రమాదం కలగకుండా చూసేందుకు, కొద్దిరోజుల పాటు ఈ ఘాట్ రోడ్డు మార్గంలో ప్రత్యేక గస్తీ (పెట్రోలింగ్) నిర్వహించాలని అటవీశాఖ అధికారులను ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశించారు. ఏనుగుల సంచారంపై సమాచారం అందిన వెంటనే స్పందించి, తమను సురక్షితంగా ఒడ్డున పడేసిన ఎమ్మెల్యే నానికి, అధికారులకు బస్సు ప్రయాణికులు, వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Agri Gold Scam: ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం - ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ - చేస్తే రాజకీయంగా మేలు!

Frequently Asked Questions

చంద్రగిరిలో ఏనుగుల గుంపు వల్ల ఏం జరిగింది?

చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిపై భారీ ఏనుగుల గుంపు రోడ్డుపైకి రావడంతో సుమారు గంటపాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.

ఈ సంఘటనపై ఎమ్మెల్యే పులివర్తి నాని ఎలా స్పందించారు?

ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే స్పందించి, అంబులెన్సులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలించాలని, ఏనుగులను అడవిలోకి సురక్షితంగా తరలించాలని అధికారులను ఆదేశించారు.

ఏనుగులను ఎలా తరలించారు?

అటవీ, పోలీస్ శాఖల అధికారులు శ్రమించి ఏనుగుల గుంపును రహదారిపై నుండి దట్టమైన అటవీ ప్రాంతంలోకి విజయవంతంగా తోలేశారు.

ప్రయాణికులకు భవిష్యత్తులో ఇబ్బందులు కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

రాత్రి వేళల్లో ఏనుగుల సంచారంపై ప్రత్యేక గస్తీ నిర్వహించాలని ఎమ్మెల్యే అటవీశాఖ అధికారులను ఆదేశించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh Fires on YS Jagan: జగన్ పేరులో 'జీ' అంటే గొడ్డలి.. ఆయనకి సీసీడీ అనే జబ్బువల్లే ఈ ప్రవర్తన: నారా లోకేష్
జగన్ పేరులో 'జీ' అంటే గొడ్డలి.. ఆయనకి సీసీడీ అనే జబ్బువల్లే ఈ ప్రవర్తన: నారా లోకేష్
Nara Lokesh Speech: రాజకీయాల్లో విరాట్ కోహ్లీ చంద్రబాబు.. అహంకారంతో వైసీపీ 11 సీట్లకు పడిపోయింది: నారా లోకేష్
రాజకీయాల్లో విరాట్ కోహ్లీ చంద్రబాబు.. అహంకారంతో వైసీపీ 11 సీట్లకు పడిపోయింది: నారా లోకేష్
High Tension in Tadipatri: తాడిపత్రిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్.. భారీగా పోలీసు బందోబస్తు!
తాడిపత్రిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్.. భారీగా పోలీసు బందోబస్తు!
AP Annadata Sukhibhava Status: ఏపీలో అన్నదాత సుఖీభవపై లేటెస్ట్ అప్‌డేట్! ఖరీఫ్‌ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు ఇస్తారంటే?
ఏపీలో అన్నదాత సుఖీభవపై లేటెస్ట్ అప్‌డేట్! ఖరీఫ్‌ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు ఇస్తారంటే?
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS BJP Secret Alliance Rumours: బీజేపీపై పోరాడకుండా ఒంటరి పోటీ అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం సీరియస్‌గా లేదా?
బీజేపీపై పోరాడకుండా ఒంటరి పోటీ అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం సీరియస్‌గా లేదా?
Yogi Adityanath Strategy: మూడో సారి గెలిచేందుకు ఆదిత్యనాథ్ స్కెచ్ - అఖిలేష్ యాదవ్ రివర్స్ ప్లాన్ - యూపీలో ఏం జరుగుతోంది?
మూడో సారి గెలిచేందుకు ఆదిత్యనాథ్ స్కెచ్ - అఖిలేష్ యాదవ్ రివర్స్ ప్లాన్ - యూపీలో ఏం జరుగుతోంది?
Peddi Collections Day 9: ఓవర్సీస్‌లో 'పెద్ది'గాడి కలెక్షన్స్ మళ్ళీ పెరిగాయ్... సెకండ్ వీకెండ్ రామ్ చరణ్ జోరు కంటిన్యూ అవుతుందా?
ఓవర్సీస్‌లో 'పెద్ది'గాడి కలెక్షన్స్ మళ్ళీ పెరిగాయ్... సెకండ్ వీకెండ్ రామ్ చరణ్ జోరు కంటిన్యూ అవుతుందా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏది? ఈ టైమ్‌లో తాగితే ఎక్కువ మంచిదా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏది? ఈ టైమ్‌లో తాగితే ఎక్కువ మంచిదా?
Used Car RC Transfer Structure: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఆర్సీ ట్రాన్స్‌ఫర్‌ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఆర్సీ ట్రాన్స్‌ఫర్‌ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Apple WWDC 2026: ఆపిల్‌ వాచ్‌ ఓఎస్‌ 27తో కొత్త ఎక్స్‌పీరియన్స్‌! మీ చేతిపై భవిష్యత్‌ టెక్నాలజీ!
ఆపిల్‌ వాచ్‌ ఓఎస్‌ 27తో కొత్త ఎక్స్‌పీరియన్స్‌! మీ చేతిపై భవిష్యత్‌ టెక్నాలజీ!
Bhoomika Ramesh: 12 ఏళ్లకే డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్.. ఎక్స్‌ప్రెషన్స్‌ క్వీన్ మేఘసందేశం భూమి.. ఇంట్రెస్టింగ్ విషయాలు
12 ఏళ్లకే డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్.. ఎక్స్‌ప్రెషన్స్‌ క్వీన్ మేఘసందేశం భూమి.. ఇంట్రెస్టింగ్ విషయాలు
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలో రంగంలోకి రోమా- గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్!
ఆదిలాబాద్ జిల్లాలో రంగంలోకి రోమా- గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్!
Embed widget