నిజం గెలవాలి యాత్రను ప్రారంభించిన నారా భువనేశ్వరి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో హతాశులై మృతి చెందిన వారి ఫ్యామిలీలను పరామర్శించనున్నారు. అక్టోబర్‌ 17న మృతి చెందిన ఆవుల ప్రవీణ్‌రెడ్డి కుటుంబాన్ని మొదట భువనేశ్వరి ఓదార్చారు. ప్రవీణ్ రెడ్డి తల్లి  అనురాధకు ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.






అనంతరం కనుమూరి చిన్నబాబు నాయుడి ఫ్యామిలీని పరామర్శించారు. పాకాల మండలంలోనే నెద్రగుంట గ్రామంలో ఉండే చిన్నబాబు నాయుడి కుటుంబానికి ధైర్యం చెప్పారు. వారికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి భరోసా ఇచ్చారు. 


యాత్రకు బయల్దేరే ముందు నారా భువనేశ్వరి టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్.టి. రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.