TTD News: శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆటలు - తిరుమలలో ధర్నా చేసిన బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్

Tirumala: తిరుమలలో రాజకీయాలు మాట్లాడటాన్ని కూడా టీటీడీ నిషేధించింది. కానీ బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ నేరుగా నిరసన చేపట్టడం సంచలనంగా మారింది.

Continues below advertisement

Bode Ramachandra Yadav : తిరుమలలో బిసివై పార్టీ బోడే రామచంద్రయాదవ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. పలువురు సాధువులతో కలిసి శ్రీవారి ఆలయం వద్ద  నిరసన చేపట్టారు. తిరుమల పవిత్రతను వెంకన్నకు విన్నవిద్దాం అంటూ పాదయాత్రగా తిరుమలకు వచ్చారు రామచంద్రయాదవ్. ఆయనతో పాటు చాలా మంది సాధవులను తనతో పాటు తీసుకు వచారు. ఆయనకు రాజకీయ వ్యాఖ్యలు, నిరసనలు చేయకూడదని బోడె రామచంద్రయాదవ్  కు అలిపిరిలోనే పోలీసులు నోటీసులు ఇచ్చారు. అప్పటికి నోటీసులు తీసుకున్న ఆయన కొండపైకి వచ్చిన తర్వాత పోలీసులు నోటీసులు, టీటీడీ నిభందనలు బేఖాతరు చేస్తూ నిరసన చేపట్టారు. శ్రీవారి ఆలయం ముందు ఇలాంటి నిరసనలు చేపట్టడం నేరమని విజిలెన్స్ పోలీసులు చెప్పినా వినిపించలేదు. విజిలెన్స్,పోలీసులతో గొడవకు దిగిన రామచంద్ర యాదవ్ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఎంత సర్థి చెబుతున్న పట్టించుకోకుండా నిరసనకు కూర్చోవడంపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆలయం ముందు నుంచి బోడె రామచంద్రయాదవ్ తో సహా సాధువులను అదుపులోకి తీసుకొని తిరుపతికి స్టేషన్ కు తరలించారు.                  

Continues below advertisement

ముందుగా ప్లాన్ చేసుకున్నట్లుగా ఈ వ్యవహాన్ని తర్వాత రామచంద్ర యాదవ్ అనుచరులు సోషల్ మీడియాలోనూ ప్రచారం చేసుకుటున్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తూంటే పోలీసులు అరెస్టు చేశారని చెప్పుకుంటున్నారు. 

తిరుమలను రాజకీయాలకు ఉపయోగించుకోకూడదని హిందువుల పవిత్ర క్షేత్ర తిరుమలను .. అంతే పవిత్రంగా ఉంచాలని టీటీడీతో పాటు భక్తులూ కోరుకుంటూ ఉంటారు. తిరుమల అంశంపై ఏమైనా రాజకీయ ధర్నాలు, నిరసనలు చేపట్టాలంటే తిరుపతిలో చేసుకోవచ్చు.కానీ ప్రశాంతంగా దేవుని దర్శనం కోసం వచ్చే వారికి ఇబ్బంది కలిగిస్తూ ఆలయం ముందు రామచంద్ర యాదవ్ బైఠాయించడం ఖచ్చితంగా భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనన్న విమర్శలు వస్తున్నాయి. 

సనాతన ధర్మం, దేవునిపై  భక్తిఉన్న వారు ఇలా శ్రీవారి ఆలయాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోరని అంటున్నారు. రామచంద్ర యాదవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ ఓ సారి జనసేన పార్టీ తరుపన పోటీ చేసి బయటకు వచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోరాడారు. గత ఎన్నికల్లో బీసీవై అనే పార్టీ పెట్టి రాష్ట్రమంతటా పోటీ చేశారు.ఆయన స్వయంగా  మంగళగిరితో పాటు పుంగనూరులోనూ పోటీ చేశారు. కానీ ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. అయితే ఇప్పుడు ఆయన కొంత మంది సాధువుల్ని పోగేసుకుని తిరుమల పవిత్రత పేరుతో పాదయాత్రగా వచ్చి రాజకీయాలు చేయడం సంచలనంగా మారుతోంది. ఉద్దేశపూర్వకంగా ఆయన తిరుమలను అపవిత్రం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.  

Continues below advertisement