CM Chandrababu: శ్రీవారి కృపా కటాక్షాలకు పాత్రుడైన గరిమెళ్ల.. టీటీడీ ఆస్థాన గాయకుడి మరణంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

Continues below advertisement

అమరావతి: టీటీడీ ఆస్థాన గాయకుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూయడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆస్థాన గాయకుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. 1978 నుండి 2006 వరకు టిటిడిలో ఆస్థాన గాయకుడిగా సేవలు అందించిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ 600 లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు.

Continues below advertisement

సంప్రదాయ కర్ణాటక, జానపద, లలిత సంగీతంలోనూ ప్రావీణ్యత కలిగిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తిరుమల శ్రీవారి సేవలో తరించారని చంద్రబాబు పేర్కొన్నారు. తన మధుర గాత్రంతో శ్రీ వేంకటేశ్వరుని కృపా కటాక్షాలకు పాత్రుడయ్యారు.. మహనీయుడు గరిమెళ్ల మనల్ని వదిలి వెళ్ళడం బాధాకరం అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని చంద్రబాబు దేవుణ్ణి ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Continues below advertisement