YSRCP Leaders  On Pawan :   భీమవరంలో పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై వైఎస్ఆర్‌సీపీ నేతలు ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. పవన్ చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవడానికి కూడా అనర్హుడన్నారు. 


పవన్ పాలిటిక్స్‌కు పనికి రాడు : అంబటి రాంబాబు


పాలిటిక్స్ కు పవన్ పనికిరాడని ఏపీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.  భీమవరంలో  పవన్ ఒక వీధి రౌడీలా మాట్లాడారన్నారు. పిచ్చి కుక్కలా స్వైర విహారం చేశారని మండిడ్డారు. నా కొడకల్లారా అనే పదాన్ని ఉపయోగించిన వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కులాలను రెచ్చగొడుతున్నారని అంబటి విమర్శించారు. కాపులందరినీ టీడీపీ అధినేత చంద్రబాబు చంకనెక్కించాలని చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు సీఎం కావాలనేదే పవన్ లక్ష్యమని, పెత్తందార్ల పల్లకిని పవన్ మోస్తున్నారని చెప్పారు.న


పవన్ తుస్సుమనపించారన్న గ్రంథి శ్రీనివాస్ 


భీమవరం సభపై సస్పెన్స్ క్రియేట్ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్  తన ప్రసంగాన్ని తుస్సుమనిపించారని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్  వ్యాఖ్యానించారు.  జనసేన అంటే ప్యాకేజీ పార్టీ అని.. అబద్దాల పార్టీ అని అన్నారు.   పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు హింసిస్తే అన్ని వర్గాలు బాధపడ్డాయన్నారు.  పవన్ ఉసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చుకున్నారన్నారు. ‘‘నాకు సీఎం పదవి ఎవరు ఇస్తారని పవన్ మాట్లాడారు.. నాకు మీరంతా ఓట్లు వేయలేదంటూ సొంత పార్టీ వాళ్ళను అవమానిస్తున్నారు.. మహనీయుల పేర్లు పలుకుతూ వారికి అపవిత్రత ఆపాదిస్తున్నారని ఆరోపించారు.  భీమవరం వచ్చి డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడిన పవన్ అంతకుముందు 10యేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వారిని ప్రశ్నించలేదన్నారు.  


పవన్ సవాల్‌కు నవ్వొస్తోందన్న వెల్లంపల్లి 


జనసేన అధినేత పవన్‌   పవన్‌ పగటి కలలు కంటున్నారని  మాజీ మంత్రి వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. గోదావరి జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ గెలిస్తే పవన్‌ పార్టీ మూసేసుకొని వెళ్తావా? అంటూ సవాల్‌ విసిరారు.  ఎమ్మెల్యే కాదు కదా.. అసెంబ్లీ గేటు కూడా దాటే అర్హత పవన్‌కి లేదు. ఒక్కచోట కూడా గెలవని వ్యక్తి సవాల్‌ విసురుతుంటే నవ్వొస్తోంది  అని ఎద్దేవా చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మమ్మల్ని ఓడించడం సంగతి తర్వాత.. ముందు అభ్యర్థుల్ని వెతుక్కోవాలన్నారు.  
 
సింగిల్‌గా పోటీ చేసే దమ్ము పవన్ కు లేదు : ఎంపీ నందిగం 


సింగిల్‌గా పోటీచేస్తామనే దమ్ము పవన్ కళ్యాణ్‌కు లేదని ఎంపీ నందిగం సురేష్ విమర్శించారు. తమ సీఎం జగన్‌ను చూసి బయపడుతున్నారని, అబద్దాలు ఆడడంలో చంద్రబాబు కన్నా మించిపోయారని మండిపడ్డారు. మంత్రులను తాటతీస్తా తోక్కతీస్తా అంటున్నారని, పవన్‌కు రెండుచోట్ల పైనుంచి కిందవరకూ లాగేశారని ఎద్దేవా చేశారు. ఏనాడైనా రాజకీయ నాయకుడిలా పవన్ మాట్లాడలేదని, పవన్ కళ్యాణ్ ఆకురౌడిగా వందశాతం కరెక్టు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌ తోకలో ఈక లాంటి వాడు. పవన్‌వి పిల్ల ఊపులు. ఉడుతకండ ఊపులు. ముందు పవన్ ఎమ్మెల్యేగా గెలవు. అసెంబ్లీ గేటుదగ్గర నిలబడి చెప్పు అని సవాల్ చేశారు.