Ap Highcourt : అమరావతి పాదయాత్రపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని అమరావతి రైతులు, పాదయాత్ర అనుమతి రద్దు చేయాలని ఏపీ డీజీపీ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. పాదయాత్రలో 600 మంది రైతులు పాల్గొనవచ్చని ఆదేశాలు ఇచ్చింది. ఐడీ కార్డులు ఉన్నవారు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐడీ కార్డులు రైతుల కు వెంటనే ఇవ్వాలని పోలీస్ అధికారులకు హైకోర్టు ఆదేశించింది. సంఘీభావం తెలిపే వారు రోడ్డుకు ఇరువైపులా ఉండాల్సిందేనని గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. పాదయాత్ర ప్రారంభించుకోవచ్చని రైతులకు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. ఆంక్షల ఉల్లంఘించవద్దని రైతులకు స్పష్టం చేసింది. రైతులు షరతులు ఉల్లంఘిస్తే హైకోర్టును ఆశ్రయించవచ్చని డీజీపీకి సూచించింది.
ఆరు వందల మంది రైతులు మాత్రమే పాల్గొనాలని హైకోర్టు ఆంక్షలు
అమరావతి రైతుల పాదయాత్రను గతంలో మానవేంద్రరాయ్ గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లుగా ధర్మాసనం తెలిపింది. అమరావతి రైతులు పాదయాత్ర చేసుకునే తప్పుడు వేరే ఎవరు వీళ్ళకి అడ్డంకులు కలిగించకుండా పోలీసులు తగు జాగ్రత్తులు తీసుకోవాలని ఆదేశించింది. పది రోజుల కిందట.. అమరావతి రైతుల పాదయాత్రపై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. ఈ పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్దతు ఇచ్చే వాళ్లంతా రోడ్డుకు రెండు వైపులా నిలబడి మద్దతు తెలపాలని సూచించింది. పాదయాత్రలో కలిసి నడవకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్దతు ఇచ్చేవాళ్లు పాదయాత్రలో కలిసి నడవకుండా చూసే బాధ్యత పోలీస్ అధికారులదేనని తెలిపింది. పాదయాత్ర ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసులు చూడాలని ఆదేశించింది.
ఆరు వందల మందికి ఐడీ కార్డులివ్వాలని హైకోర్టు ఆదేశాలు
అయితే ఆరు వందల మందికి పోలీసులు ఐడీ కార్డులు ఇవ్వలేదని నూట యభై మందికి మాత్రమే ఇచ్చారని... రైతులు హైకోర్టుకు తెలిపారు. అలాగే పాదయాత్రలో ఐడీ కార్డులు ఉన్న వారే పాల్గొనాలనడం సరి కాదని.. కొంత మంది యాత్ర మధ్యలో వెళ్తూంటే.. మరికొంత మంది కలుస్తూంటారని వాదించారు. పాదయాత్రలు చేస్తున్న ఎవరికీ లేని ఆంక్షలు తమకు ఎందుకని కోర్టును ఆశ్రయించారు. అయితే వారికి ఊరట లభించలేదు. ఆరు వందల మందితోనే పాదాయత్ర చేాయలని నిర్ణయంచారు.
పాదయాత్ర ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్న రైతులు
పది రోజుల కిందట అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు ఆంక్షలు విధించినప్పుడు ఐడీ కార్డులు చూపించాలని రైతులపై పోలీసులు విరుచుకుపడ్డారు. అనుమతి ఉన్నవారిని కాకుండా మిగిలిన వారి వాహనాలను అనుమతించమని పోలీసులు స్పష్టం దీంతో, అక్కడ రైతులు.పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అమరావతి రైతుల ఐక్య కార్యాచరణ సమితి సమావేశం అయింది. పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను నిలిపివేసి న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వారికి ఊరట లభించలేదు. దీంతో రైతులు ఏం చేయబోతున్నారన్నది కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది.