ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో రూ. 371 కోట్ల అవినీతి జరిగిందని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ అన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మరోసారి ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసారి ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి హైదరాబాద్‌లో గురువారం (సెప్టెంబర్ 14) ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ స్కామ్‌లో మొత్తం 10 కీలక అంశాలు ఉన్నాయని సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడించారు.
నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లను విడుదల చేశారని వివరించారు. అధికారుల అభ్యంతరాలను నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని, తప్పుడు పత్రాలతో ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ జీవోకు,అగ్రిమెంట్‌కు చాలా తేడాలు ఉన్నాయని అన్నారు. అగ్రిమెంట్‌లో జీవో నంబర్‌ను చూపించలేదని గుర్తించారు. జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్‌లో లేవని చెప్పారు.
‘‘జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్ లో లేవు. సీమెన్స్ కంపెనీ ట్రైనింగ్ మాడ్యూల్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు. ఎక్కడా కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పెడతామని చెప్పలేదు. రాష్ట్ర మంత్రివర్గం అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌ని ఏర్పాటు చేశారు. ఆ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో విధివిధానాలు పాటించలేదు. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో ఖజానాలోని వంద కోట్లను దోచేశారు. అందులో భాగంగానే రూ.3,300 కోట్లు ఫ్రీగా సీమెన్స్ ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం కేవలం 10 శాతం ఇస్తే సరిపోతుందని అన్నారు. అలా ఏపీ ఖజానా నుండి రూ.371 కోట్ల నిధులను డిజైన్ టెక్ కు చెల్లించారు. పైలట్ ప్రాజక్టు అమలు చేయాలన్న అధికారుల వాదనను చంద్రబాబు, అధికారులు పట్టించుకోలేదు’’ అని ఏపీ సీఐడీ చీఫ్ ఆరోపణలు చేశారు.
జీవో కంటే ముందే అగ్రిమెంట్ తయారీ
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో జీవో కంటే ముందే అగ్రిమెంట్ తయారీ అయింది. తప్పుడు పత్రాలతో ఒప్పందాలు చేశారు. అగ్రిమెంట్‌లో జీవో నెంబర్‌ను చూపించలేదు.. జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్‌లో లేవు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రూ.371 కోట్ల అవినీతి జరగింది. నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లను రిలీజ్ చేశారు. అధికారుల అభ్యంతరాలను నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. తప్పుడు డాక్యుమెంట్స్‌తో ఒప్పందాలు చేసుకున్నారు. ప్రభుత్వ జీవోలకు, అగ్రిమెంట్‌కు చాలా తేడాలు ఉన్నాయి. కార్పొరేషన్ ఏర్పాటులోనూ విధి విధానాలు పాటించలేదు. కార్పొరేషన్ నుంచి ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు వెళ్లాయి. ఆ ప్రైవేట్ వ్యక్తుల నుంచి షెల్ కంపెనీలకు మళ్లాయి’’ అని సీఐడీ చీఫ్ ఆరోపించారు.