Land Registrations in AP: ఆంధ్రప్రదేశ్ లో భూముల రిజిస్ట్రేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయాయి. శుక్రవారం (డిసెంబరు 1) నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆధార్ ఈ - కేవైసీలు పని చేయకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ఆ సేవల కోసం వచ్చిన వారు రిజిస్ట్రేషన్ ఆఫీసుల మందు పడిగాపులు కాస్తు్నారు. భూముల కొనుగోలు, అమ్మకం దారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ రోజంతా రిజిస్ట్రేషన్లు అయ్యే అవకాశం లేదని అధికారులు ఎట్టకేలకు చెప్పడంతో వారు వెనుదిరిగారు.
నేడు పొద్దున 10.30 గంటల నుంచి ఇదే సమస్య ఎదురవుతూ ఉందని అధికారులు చెబుతున్నారు. ఆధార్ కేవైసీ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవడం లేదని.. అందుకే రిజిస్ట్రేషన్లు చేయలేకపోతున్నామని అధికారులు తెలిపారు. సర్వర్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని.. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.