Satyavarthan video: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ నేతలతో పాటు జగన్ చేస్తున్న ఆరోపణల్ని టీడీపీ నేతుల ఖండించారు. ఫిర్యాదు దారు అయిన సత్యవర్థన్ తో కేసును వెనక్కి తీసుకునేందుకు వంశీ కుట్రకు పాల్పడ్డారన్నారు. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి..డబ్బులు ఆశ చూపి కేసును విత్ డ్రా చేసుకునేలా చేశారన్నారు. దానికి సంబంధించి వంశీ అనుచరులు .. సత్యవర్ధన్ ను.. వంశీ ఇంటికి తీసుకెళ్తున్న సీసీ టీవీ దృశ్యాలను విడుదల చేశారు. 



ఫిర్యాదుదారు అయిన సత్యవర్థన్ ను వంశీ తీసుకెళ్లడం తీవ్రమైన అంశం 


విజయవాడ కోర్టులో సత్యవర్థన్ కేసును ఉపసంహరించుకునేలా చేసేందుకు సత్యవర్థన్ ను ముందుగా ఆయన అనుచరులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆయనను తీసుకుని హైదరాబాద్ లోని మైహోమ్ భూజాలోని ఇంట్లోకి వెళ్లారు. అక్కడ సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను  టీడీపీ నేతలు ప్రదర్శించారు. లిఫ్టులో సత్యవర్ధన్ ను వంశీ అనుచరులు తీసుకెళ్తున్న దృశ్యాలు ఉన్నాయి. కిడ్నాప్ చేసి తీసుకెళ్లి బెదిరిచి.. డబ్బులు ఆశ చూపి.. ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేశారని టీడీపీ స్పష్టం చేశారు. పూర్తి ఆధారాలతోనే కేసులు నమోదు చేశారన్నారు. 


కిడ్నాప్ చేసినట్లుగా తేలడంతో అరెస్టు చేసిన పోలీసులు        


ఓ ఫిర్యాదుదారును .. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ప్రభావితం చేయడం తీవ్ర నేరం అవుతుంది. ఇటీవల మోహన్ బాబు తన ఇంట్లోకి దూసుకు వచ్చిన జర్నలిస్టుపై దాడి చేశారు. ఆ తర్వాత ఆయనను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లారు. అది పెద్ద వివాదం అయింది. ఆయన ఫిర్యాదు దారుడును బెదిరించడానికో..త  ప్రలోభ పెట్టడానికో వెళ్లారన్న విమర్శలు వచ్చాయి. పోలీసులు కూడా ఈ అంసాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అయితే తాను కేవలం క్షమాపణ చెప్పడానికి వెళ్లానని మోహన్ బాబు కోర్టులో వాదించారు     


వైసీపీ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న టీడీపీ                      


ఇక్కడ ఫిర్యాదుదారుడ్ని వంశీ అనుచరులు నేరుగా ఆయన ఇంటికి బలవంతంగా తీసుకెళ్లడం.. తర్వాత ఆజ్ఞాతంలో ఉంచడం వంటివి చూస్తే వల్లభనేని వంశీ విషయంలో పక్కా ఆధారాలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో వల్లభనేని వంశీకి చెందిన ఆర్థిక పరమైన వ్యవహారాలను కూడా పోలీసులు వెలికి తీస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులపై నిందలు వేయడంతో పోలీసులు మరింత సీరియస్ గా ఈ కేసును విచారణ జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.  


Also Read:  ఓడినా మారని నేతల తీరు, వైసీపీ క్యాడర్‌లో అయోమయం! ఆమదాలవలసలో ఏం జరుగుతోంది ?