TDP News :  స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో వాస్తవాల పేరుతో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజెంటేషన్ ఇచ్చారు.   స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.  అవాస్తవాలు ప్రచారం చేసి చంద్రబాబుపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.  మన రాష్ట్ర పిల్లలకు నైపుణ్యం పెంచేందుకే శిక్షణ  ఇచ్చామని  ...  లక్షల మంది యువత జీవితాల్లో నిప్పులు పోస్తున్నారని మండిపడ్డారు.   నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను అబ్దుల్ కలాం కూడా ప్రశంసించారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు.  శిక్షణ తీసుకున్న పిల్లలు ప్రపంచవ్యాప్తంగా వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు.  అమెరికాలో 25 యూనివర్సిటీలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయన్నారు.   

మోదీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ లో ఈ కార్యక్రమం జరిగిందన్నారు.   మరో 5 రాష్ట్రాల్లోనూ ఈ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును అమలు చేశారని  ఎవరికీ కనిపించని అవినీతి జగన్ కు ఎందుకు కనిపిస్తోందని పయ్యావుల కేశవ్ ప్రశఅనించారు.  ఈ కేసులో డబ్బు ఎక్కడికీ పోయినట్లు నిరూపణ కాలేదన్నారు.  రివర్స్ టెండరింగ్ లా రివర్స్ ఇన్వెష్టిగేషన్ లా ఈ కేసు ఉందన్నారు.  అవినీతి చేయబోమని సంతకం చేస్తేనే ఒప్పందాలు జరుగుతాయని..   1997 తర్వాత మన దేశంలో సీమెన్స్ కార్యక్రమాలు బాగా పెరిగాయన్నారు.   నిధుల విడుదలలో ఎలాంటి తప్పు జరగలేదన్నారు.   అధికారులు కూడా ఎలాంటి తప్పు చేయలేదన్నారు.  నలుగురు అధికారుల బృందం గుజరాత్ వెళ్లి పరిశీలించి నివేదిక ఇచ్చిందని తెలిపారు.              

ఎక్కువ మంది పిల్లలకు శిక్షణ ఇవ్వడం తప్పా అని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.  నిధుల విడుదలలో ప్రేమచంద్రారెడ్డి జాగ్రత్తగా వ్యవహరించారన్నారు.  5 విడతలుగా నిధులు విడుదల చేశారని..   40 సెంటర్ల ద్వారా యువతకు శిక్షణ ఇచ్చామన్నారు.  అవి ధ్రువ పత్రాలు కూడా ఇచ్చాయని వాటిని ప్రదర్శించారు.  సీమెన్స్ టెక్నాలజీ ద్వారా అనేక లాభాలు కలిగాయన్నారు.  సీమెన్స్ సంస్థ ఇచ్చే శిక్షణను అబ్దుల్ కలాం ప్రశంసించారని గుర్తు చేశారు.  చంద్రబాబును అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి కావాల్సి ఉందన్నారు.  17ఏ ప్రకారం చంద్రబాబును అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అని  పయ్యావుల స్పష్టం చేశారు.                                                   

కక్ష పూరితంగానే చంద్రబాబును అరెస్టు చేశారన్నారు.   స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అసలు అవినీతే జరగలేదన్నారు.   అన్ని విషయాలు పరిశీలించాకే అధికారులు విడుదల చేశారని పత్రాలు విడుదల చేశారు.  రూ.371 కోట్లలో ప్రతి రూపాయి ఎవరికి, ఎలా వెళ్లాయో వివరాలు ఉన్నాయన్నారు.  పాలసీ మేకింగ్ మాత్రమే సీఎం, క్యాబినెట్ చేస్తాయి   ఏ పాలసీ అయినా అమలు బాధ్యత పూర్తిగా అధికారులదేనన్నారు.