TDP News : నవరత్నాల్లో 10 శాతమే అమలు - వాస్తవ పత్రం విడుదల చేసిన టీడీపీ !

సీఎం జగన్ ఇచ్చిన హమీల్లో పది శాతమే అమలు చేశారని టీడీపీ వాస్తవపత్రం విడుదల చేసింది. జగన్ ప్రతీ మాట మోసమేనని అచ్చెన్నాయుడు విమర్శించారు.

Continues below advertisement


TDP News : ప్రకాశించని  నవరత్నాలు... జగన్ రెడ్డి మోసపు లీలలు పేరుతో తెలుగుదేశం వాస్తవ పత్రాన్ని విడుదల చేసింది. చెప్పిన మేరకు చేయని హామీలు 39 ఉన్నాయంటూ టీడీపీ  ఆ పుస్తకంలో పేర్కొంది.  నవరత్నాల పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు తొమ్మిదైతే... వాటికింద 40 హామీలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశామంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవమని అచ్చెన్నాయుడు విమర్శఇంచారు.  జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన హామీలు 10 శాతం మాత్రమే అని.. తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మోసగిస్తున్నారని మండిపడ్డారు. 

Continues below advertisement

రైతు భరోసా కింద రూ.13500 ఇస్తానని చెప్పి ఇచ్చేది రూ.7500 మాత్రమే అని తెలిపారు. రైతు భరోసా కింద 12 హామీలు ఇస్తే ఒక్కటీ అమలు కాలేదని మండిపడ్డారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఇచ్చిన 8 హామీల్లో 8 అమలు కాలేదని అన్నారు. ఫించన్ల పెంపు కింద ఇచ్చిన మూడు హామీల్లో రెండు అమలుకాలేదని తెలిపారు. అలాగే అమ్మఒడి కింద ఇచ్చిన రెండు హామీల్లో రెండూ అమలు కాలేదని.. పేదలందరికీ ఇళ్లు పేరిట ఇచ్చిన ఐదుు హామీల్లో ఒక్కటీ అమలు కాలేదన్నారు. బోధనా రుసుము చెల్లింపు కింద ఇచ్చిన రెండు హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. వైఎస్సార్ జలయజ్ఞం కింద ఇచ్చిన మూడు హామీలకు మూడూ పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. మద్యనిషేధం అంటూ ఇచ్చిన ఒక్క హామీ ఇంతవరకు అమలుకాలేదన్నారు. వైఎస్సార్ ఆసరా, చేయూతల కింద ఇచ్చిన నాలుగు హామీల్లో నాలుగు పెండింగ్‌లోనే ఉన్నాయని అచ్చెన్నాయుడు  మేనిఫెస్టోను వివరిచారు. 

వైఎస్సార్ జలయజ్ఞం కింద ఇచ్చిన 3 హామీలకు 3 పెండింగ్‍లోనే ఉన్నాయని, మద్య నిషేధమంటూ ఇచ్చిన ఒక్క హామీ ఇంత వరకు అమలు కాలేదన్నారు. వైఎస్సార్ ఆసరా, చేయూత కింద 4 హామీల్లో 4 పెండింగ్‍లోనే ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మందుల కొరత లేకుండా చేశామన్నారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో పేదవాడికి సరైన వైద్యం అందడం లేదన్నారు.  జగన్ చెప్పేవన్నీ అసత్యాలేనని .. ఒక్కటీ నిజం ఉండదన్నారు. - ఎన్నికల ముందు చెప్పేది ఒకటి.. అధికారంలోకి వచ్చాక చేసిందొకటని, అమ్మఒడి కింద రూ.15 వేలు ఇస్తామని.. రూ.13 వేలు ఇస్తారా? అని నిలదీశారు. 

రాష్ట్రంలో 84 లక్షల మంది పిల్లలు ఉంటే 42 లక్షల మందికే ఇస్తారా? అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం కార్యక్రమం తీసుకొస్తామని ప్రకటించారు. తల్లికి వందనం పేరుతో ప్రతి మహిలకు రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఫించన్ రూ.200 ఉంటే రూ.1800 పెంచి రూ.2 వేలు ఇచ్చామని, టీడీపీ 74 లక్షల మందికి పింఛన్ ఇస్తే మీరు 62 లక్షల మందికి ఇస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ వచ్చాక 10 లక్షల మందికి పింఛన్ తొలగించడం వాస్తవం కాదా? అన్నారు. ఏవేవో సాకులతో పేదవాడి పథకాలన్నీ తీసేసి మోసం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు.                                               

Continues below advertisement