Talliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం పథకం' 2026-27 విద్యా సంవత్సరానికి డబ్బులు విడుదలపై ప్రకటన చేసింది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులకు జూన్ 2026 లో నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. పేద, మధ్య విద్యార్థుల చదువును కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. ఇంట్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తుంది. స్కూల్ డ్రాప్ అవుట్ల తగ్గించడం కోసం రూ.15 వేలు నేరుగా తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు.  

తల్లి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15,000 జమ చేస్తారు. ఇందులో రూ.13,000  తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. రూ.2,000 స్కూల్, కాలేజీ నిర్వహణ కోసం తల్లి లేనిప పక్షంలో తండ్రి లేదా సంరక్షకుడి బ్యాంకు అకౌంట్ డబ్బులు జమ చేస్తారు. 

తదుపరి విడత ఎప్పుడు? 

జూన్ 2026లో తల్లికి వందనం డబ్బులు విడుదల చేస్తారు. వచ్చే విద్యాసంవత్సరం స్కూల్లు ప్రారంభమైన అయిన వెంటనే డీబీటీ ద్వారా డబ్బులు జమ చేస్తారు. ఈ డబ్బులను స్కూలు ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ కోసం ఉపయోగించాలని ప్రభుత్వం సూచిస్తుంది. 

అర్హతలు

  1. ఈ పథకానికి 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదవాలి. 
  2. ప్రభుత్వ లేదా ప్రైవేట్ స్కూళ్లలో చదవాలి.
  3. కనీసం 75% హాజరు తప్పనిసరి
  4. తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి. 
  5. బ్యాంకు అకౌంట్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి
  6. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షల కంటే తక్కువ ఉండాలి.  
  7. కుటుంబంలో ఎంత మంది పిల్లలు అంత మందికి ఒక్కొక్కరికీ రూ. 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు.
  8. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, ప్రజా ప్రతినిధుల పిల్లలు అనర్హులు. 

తల్లికి వందనం పథకం దరఖాస్తు విధానం

  • ప్రస్తుతం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక విధానం అందుబాటులో లేదు.
  • ఈ పథకం కింద విద్యార్థి పేరు నమోదు చేయించుకోవడానికి వారి తల్లిదండ్రులు పాఠశాల హెడ్ మాస్టర్ లేదా గ్రామ సచివాలయం సిబ్బందిని సంప్రదించవచ్చు.
  • పాఠశాల డేటాను సేకరించి, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తుంది. 
  • లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడాలంటే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఆధార్‌తో NPCI లింకింగ్ అయి ఉండాలి.

సెలక్షన్ ప్రాసెస్

  • దరఖాస్తుదారు సమర్పించిన సర్టిఫికెట్లను పరిశీలించి అర్హతను గుర్తిస్తారు.
  • కుటుంబ ఆర్థిక స్థితి, విద్యార్థి హాజరు శాతం ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేస్తారు.  

అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? 

అప్లికేషన్ స్టేటస్ ను ఆధార్ నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్ https://gsws-nbm.ap.gov.in/ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు.