Stone Pelting On Pawan Kalyan In Tenali: ఏపీలో సీఎం జగన్ (Cm Jagan)పై శనివారం రాయి దాడి ఘటన మరువక ముందే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై ఓ వ్యక్తి ఆదివారం రాయితో దాడికి యత్నించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేనాని గుంటూరు జిల్లా తెనాలిలో 'వారాహి యాత్ర' చేపట్టారు. యాత్ర సాగుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి పవన్ పై రాయి విసిరాడు. అయితే, అది ఆయనకు తగలకుండా కొద్ది దూరంలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన పవన్ భద్రతా సిబ్బంది, జనసేన కార్యకర్తలు నిందితుడు దిలీప్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.




కాగా, శనివారం రాత్రి విజయవాడలో 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో సీఎం జగన్ పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఈ ఘటనలో ఆయన ఎడమ కంటికి గాయమైంది. దీంతో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఈ ఘటనపై ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు, జనసేనాని పవన్ పై కూడా రాయి దాడి జరగడంతో టెన్షన్ నెలకొంది.



Also Read: Ysrcp Complaint: సీఎం జగన్ పై దాడి ఘటన - ఎన్నికల సంఘానికి వైసీపీ నేతల ఫిర్యాదు