Minister Dharmana Krishna Das : మళ్లీ జగన్(Jagan) ముఖ్యమంత్రి కాకపోతే తమ కుటుంబం మొత్తం శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటామని(Out of Politics) మంత్రి ధర్మాన కృష్ణదాస్(Minister Dharmana Krishnadas) సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం(Srikakulam)లో పర్యటించిన ఆయన ప్రతిపక్ష టీడీపీ(TDP)పై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా పోయిందని ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి(Atchamnaidu) ధర్మాన సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలు గెలుస్తామని అచ్చెన్నాయుడు చెబుతున్నారని, అలా గెలిస్తే గాజులు వేసుకుని కూర్చుంటామన్నారు. టీడీపీ దళారీ మాటలు ప్రజలు పట్టించుకోవడంలేదన్నారు. 



టీడీపీకి దేవుడు తగిన శాస్తి చేశాడు


"టీడీపీకి 35 శాతం ఓట్లు, వాళ్లకు నాయకులు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం(Ysrcp Govt) ఏం చేసినా తప్పు జరిగిపోతుందని వాళ్లు మాట్లాడుతున్నారు. సీఎం జగన్ చిన్న కుర్రోడు అనుభవం లేదని మాట్లాడుతున్నారు. చిన్న కుర్రోడైతేనే ప్రజలు నమ్మారు. 151 స్టీట్లు ఇచ్చారు. గతంలో 23 వైసీపీ ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులు ఇచ్చి టీడీపీ ప్రభుత్వం లాక్కుంది. అందుకు దేవుడు తగిన శాస్తి చేసి టీడీపీ 23 సీట్లు మాత్రమే ఇచ్చాడు. రాష్ట్రంలో కార్పొరేషన్ ఎన్నికల్లో(Corporation Elections) అన్ని స్థానాల్లో గెలిచాం. మున్సిపాలిటీల్లో 73 స్థానాలు గెలిచాం. ఇవన్నీ సీఎం జగన్ పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని గుర్తుచేస్తున్నాయి." అని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. 


ఇదే నా ఛాలెంజ్ 


"ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయింది. నరసన్నపేటలో మా బంధువు 25 వేల మేజారిటీతో గెలిచారు. మొన్న 20 స్థానాలు గెలుచుకున్న టీడీపీ ఈసారి 160 స్థానాలు గెలుస్తామని బీరాలు పలుకుతుంది. ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వం వస్తుంది. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే మా కుటుంబం మొత్తం రాజకీయాల్నుంచి తప్పుకుంటాం. నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నాను. మధ్యవర్తులు, దళారులు చెప్పిన మాటలు నమ్మకండి. మీకు జగనన్న, దాసన్న అండగా ఉంటారు. మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను."  అని మంత్రి ధర్మాన అన్నారు. 


నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తా


ఇటీవల శ్రీకాకుళం జిల్లా పోలాకి, చెల్లాయి వలసలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభోత్సవంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మరోసారి సీఎం అవుతారని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం కాకుండా తన ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తానని సవా్ చేశారు. రాష్ట్రానికి వైఎస్ జగన్ లాంటి నేత నభూతో నభవిష్యత్ అని అన్నారు. సీఎం జగన్ ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారన్నారు. తాను నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వస్తానని తెలిపారు.