Sri Chaitanya Institutions World Record: శ్రీచైతన్య విద్యా సంస్థలు (Sri Chaitanya Educational Institutions).. 39 ఏళ్ల క్రితం ప్రారంభమై విద్యా వ్యవస్థలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్నాయి. సామాన్య విద్యార్థులను సైతం విశ్వ విజేతలుగా తీర్చిదిద్దుతూ ఐఐటి-జేఈఈ, ఏఐఈఈఈ, నీట్, ఒలింపియాడ్ వంటి జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో నెం.1 ర్యాంకులు సాధిస్తూ… విద్యారంగంలో అగ్రగామిగా ప్రపంచ రికార్డులను సైతం సాధించాయి. ఇప్పుడు ఓ సరికొత్త ప్రపంచ రికార్డ్ సాధించేందుకు సమాయత్తమవుతోంది. గణితంలో బాల మేధావుల ప్రతిభా పాటవాలను విశ్వ వ్యాప్తం చేసేందుకు సంకల్పించి ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేసింది. ఇందుకోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, UKతో కలిసి పని చేస్తున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా శ్రీచైతన్య భారీ స్థాయి విజయాలను అందించడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులకు ఉత్తమమైన విద్య అందించడం మాత్రమే కాకుండా, శ్రీచైతన్య సాధించబోయే రికార్డులతో విద్యార్థులకు ప్రేరణ కల్పించాలనే లక్ష్యాన్ని కూడా పెట్టుకుంది.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రత్యేక ప్రతిభను.. వివిధ రంగాల్లో సాధించిన అద్భుత విజయాలను డాక్యుమెంట్ చేయడంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, UK సంస్థ అసాధారణ మానవ సామర్థ్యాలను గుర్తించి, శ్రేష్ఠత వైపు ప్రయాణించాలనే ఉద్దేశంతో ఇతరులు స్ఫూర్తి పొందేందుకు వేదికగా పనిచేస్తుంది.
3 ప్రపంచ రికార్డులు
శ్రీచైతన్య విద్యా సంస్థలు విద్యార్థుల అసాధారణ సామర్థ్యాలను, వినూత్న అభ్యాస విధానాలను ప్రదర్శిస్తూ మూడు ప్రత్యేక ప్రపంచ రికార్డులను నెలకొల్పాయి.
- 2018లో 2.5–5 సంవత్సరాల వయస్సు గల 100 మంది విద్యార్థులు 100 దేశాల మ్యాప్‌లను పఠించి, భౌగోళిక అవగాహనలో అద్భుతమైన ఫీట్ సాధించారు.
- 2022లో 601 మంది విద్యార్థులు 118 అంశాలను పఠించి, 10 రాష్ట్రాల్లో పరమాణు చిహ్నాలతో కూడిన ఆవర్తన పట్టికను ప్రదర్శించారు.
- 2023లో 2,033 మంది విద్యార్థులు 100 నిమిషాల్లో 1 నుంచి 100 వరకు గుణకార పట్టికలను పఠించారు. ఇది శ్రీచైతన్య 100 రోజుల అంకితభావంతో కూడిన శిక్షణకు నిదర్శనం.
2024 నవంబర్ 6న విద్యా నైపుణ్యంలో సరికొత్త అధ్యాయానికి తెరలేవనుంది. 20 రాష్ట్రాల నుంచి 10 వేల మంది ప్రతిభావంతులు పాల్గొనే ఈ చారిత్రాత్మక ఘట్టంలో 3 - 10 సంవంత్సరాల వయసున్న చిన్నారులు కేవలం మూడు గంటల్లో 600 మ్యాథ్స్ ఫార్ములాలు ఏకకాలంలో పఠించి ప్రపంచ రికార్డ్ సృష్టించబోతున్నారు. విద్యారంగ చరిత్రకే తలమానికంగా నిలవబోతోన్న ఈ ఈవెంట్ కోసం శ్రీచైతన్య విద్యాసంస్థ తమ విద్యార్దులకు 100 రోజుల్లో అకుంఠిత దీక్షతో శిక్షణ ఇచ్చి ఈ మహా యజ్ఞానికి సిద్ధం చేశారు. సూపర్ హ్యాట్రిక్ ప్రపంచ రికార్డు ప్రయత్నించేందుకు భారతదేశం నలుమూలల నుంచి శ్రీ చైతన్య విద్యార్థులు ఒక చారిత్రాత్మక విజయ సాధన కోసం కలిసి వస్తున్నారు.
ఈ వేదిక శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్ ఎక్సలెన్స్‌ను మాత్రమే కాకుండా, విద్యా సాధనలో కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేయడంలో సంస్థ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. శ్రీ చైతన్య యాజమాన్యం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు 10,000 మంది విద్యార్థులకు తమ హృదయపూర్వక మద్దతు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్న బాల మేధావులందరికి శుభాకాంక్షలు!