Action against MLAs who do not come to  assembly : YSRCP ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు హాట్ కామెంట్స్ చేశారు.  అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని 10 మంది YSRCP ఎమ్మెల్యేలు ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే జీతం తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై రాజ్యాంగ బద్ధంగా చర్యలు తీసుకుంటామని, అసెంబ్లీలో చర్చలు జరిపిస్తానని స్పీకర్ స్పష్టం చేశారు.    

Continues below advertisement


ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీకి వచ్చేది లేదని జగన్ ప్రకటన            
 
2024 అసెంబ్లీ ఎన్నికల్లో TDP-JSP-BJP కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, YSRCP ప్రతిపక్షంగా మారింది. కానీ పది శాతం సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ న్యాయపోరాటం చేస్తున్నారు. కానీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు YSRCPకు  ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. దీంతో వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు బాయ్‌కాట్ చేస్తోంది. ఈ క్రమంలో 11 మంది YSRCP ఎమ్మెల్యేలు  జగన్ సహా హాజరు కావడం లేదు.  జగన్ తన జీతాన్ని తీసుకోవడం లేదని, మిగిలిన 10 మంది తీసుకుంటున్నారని స్పీకర్  మీడియాకు చెప్పారు.              


అసెంబ్లీకి రాకపోయినా జీతాలు తీసుకుంటున్న పది మంది ఎమ్మెల్యేలు               


వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకుంటామని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. "రాజ్యాంగ బద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది పరిశీలిస్తున్నాము" అని స్పష్టం చేశారు. జీతం తీసుకుని డ్యూటీ చేయకపోతే ఉద్యోగులను సస్పెండ్ చేస్తామని, ఉద్యోగం నుంచి తీసేస్తామని  ..అటువంటిది ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు?" అని  అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.   "అసలు కోడికి గుడ్డుకు తేడా తెలియని వైసీపీ వాళ్ల గురించి మాట్లాడటం వేస్ట్" అని అన్నారు. రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టాయని, రాజకీయాలు కాస్ట్‌లీగా మారిపోయాయని కూడా వ్యాఖ్యానించారు. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చలు జరగనున్నాయని, ప్రజల సమస్యలపై చర్చించాలంటూ YSRCP ఎమ్మెల్యేలకు సూచించారు.              


వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వారిపై కఠిన చర్యలు                   
 
ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడంపై అసెంబ్లీలో చర్చించి ఎమ్మెల్యేల జీతాలు ఆపివేయడం లేదా సస్పెన్షన్‌లు విధించడం వంటివి జరగవచ్చు. ఈ మధ్య అసెంబ్లీ సమావేశాల్లో YSRCP ఎమ్మెల్యేలు హాజరు కాకుండా, ప్రజల సమస్యలు చర్చించకపోవడం పట్ల TDP నేతలు కూడా  తీవ్ర విమర్శల చేస్తున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు గతంలో కూడా YSRCPపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, మంత్రులు, ఎమ్మెల్యేలపై చురకలు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి జీతాల విషయం కీలకంగా మారింది.