SCR Railway Profit :   సౌత్ సెంట్ర‌ల్ రైల్వే మ‌రో అరుదైన రికార్డు ద‌క్కించుకుంది. కేవ‌లం 103 రోజుల్లో స్క్రాప్ అమ్మ‌కాల ద్వారా 100 కోట్ల ఆదాయాన్ని స‌ముపార్జించింది. మిగిలిన జోన్‌ల‌న్నింటిలో మిన్న‌గా నిలిచింది. 'మిషన్ జీరో స్క్రాప్'  సాధించి అగ్ర‌తాంబూలం అందుకుంది.రైల్వే ప‌రిస‌రాల్లో ప‌రిశుభ్రంగా ఉంచేందుకు ఎస్ సీ ఆర్ ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటుంది. అందులో భాగంగా నిరుప‌యోగంగా ఉన్న స్క్రాప్ ను ప‌క్క‌న ప‌డేయకుండా వాటి విక్ర‌యాల ద్వారా సంస్థ‌కు ఆదాయ వ‌న‌రులుగా మారుస్తోంది. ఈ చ‌ర్య ద్వారా వర్క్‌షాప్‌లు, లోకో షెడ్‌లు, రైల్వే యూనిట్లు  ప్రాంగణాలను శుభ్ర‌ప‌డ‌డంతో పాటు   స్క్రాప్ మెటీరియల్ విక్ర‌యాల ద్వారా సంస్థకు ఆదాయం ల‌భిస్తోంది. 


ఇప్ప‌టికే చాలా వర్క్‌షాప్‌లు, షెడ్‌లు  కొన్ని డివిజన్లు "మిషన్ జీరో స్క్రాప్ ఘ‌న‌త‌ను  సాధించ‌గా మ‌రికొన్ని ఆ రికార్డు ద‌క్కించుకునే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. తాజాగా ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో కేవ‌లం 103 రోజుల్లో  స్క్రాప్ అమ్మకాల ద్వారా 100 కోట్ల ఆదాయం ల‌భించింది. గ‌తేడాది ఆదాయానికి రెట్టింపు ల‌భించింద‌ని రైల్వే అధికారులు తెలిపారు.  2021-22కి స్క్రాప్ విక్రయాన్ని రెట్టింపుగా ఆదాయం స‌మ‌కూరింది..అప్పుడు 52.12 కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే ఆదాయం ల‌భించింది..ఇప్పుడు రెట్టింపుగా ఆదాయం ల‌భించ‌టంతో రైల్వే వ‌ర్గాల్లో హ‌ర్షాతి రేకాలు వ్య‌క్తం అవుతున్నాయి.


భారతీయ రైల్వేల ఇ-ప్రొక్యూర్‌మెంట్ ప‌ద్ధ‌తిలో ఆన్‌లైన్‌లోనే స్క్రాప్ విక్ర‌యాలు చేప‌ట్టారు. డివిజన్లు, వర్క్‌షాప్‌ల నుండి సేకరించిన పట్టాలు ఇతర  వస్తువులు, రైల్వే లోకోలు, కోచ్‌లు, వ్యాగన్‌లు, ఇతర ఫెర్రస్, నాన్-ఫెర్రస్ మెటీరియల్‌లను పారవేయ‌కుండా విక్ర‌యించారు.  ఇ-ప్రొక్యూర్‌మెంట్, ఇ-స్క్రాప్ అమ్మకాల కార్యక్రమాల ద్వారా జోన్‌కు రైల్వే బోర్డు ఎఫిషియెన్సీ షీల్డ్ కూడా అందచేసింది.
 
క‌రోనా త‌రువాత రైల్వే కు బారీగా చేకూరిన ఆదాయం ఇదే...క‌రోనా స‌మ‌యంలో కూడ ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని రంగాలు మూల‌న‌ప‌డ్డాయి..ఎ రంగంలో కూడ కార్య‌క‌లాపాలు జ‌ర‌గ‌లేదు..అయితే రైల్వే లో మాత్రం పార్శిల్ ర‌వాణా ద్వారా కోట్ల రూపాయ‌ల ఆదాయాన్ని స‌మ‌కూర్చుకుంది. దీంతో క‌రోనా కాలంలో కూడ ఆద‌యాన్ని స‌మ‌కూర్చుకున్న శాఖ‌గా రైల్వే రికార్డ్ లోకి ఎక్కింది.  ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఆదాయం కూడ ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిదిలో కొంత మాత్ర‌మేన‌ని కూడ ఆ శాఖ అదికారులు అంటున్నారు. స్క్రాప్ ను మెత్తం పోగేసి విక్ర‌యించింది కూడ కొంత మేర‌కే..ఇంకా రైల్వేకు చెందిన స్ద‌లాల్లో స్క్రాప్ చాలా వ‌ర‌కు పెండింగ్ లో ఉంది..వాటిని కూడ వెలికి తీసి విక్ర‌యిస్తే ఆదాయం ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.