Andhra Temples in Dalit villages Issue: దళిత వాడల్లో ఆలయాలు నిర్మించవద్దని షర్మిల చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. దీనిపై షర్మిల మరోసారి స్పందించారు.  2025 జూలైలో రాష్ట్ర హైకోర్టు, దళిత బిడ్డలు చదువుకునే చోట 228 మందికి ఒక బాత్ రూమ్ ఉందని పేర్కొందని..  ⁠దానిపై దృష్టి పెట్టండని మేము అడగడం తప్పా అని ప్రశ్నించారు.  ⁠కనీసం రోడ్లు ,డ్రైనేజీ కూడా SC,ST కాలనీలలో లేవని ప్రశ్నించడం మేము చేసిన నేరమా ?  ⁠ప్రభుత్వ దృష్టి దళితవాడల్లో గుడులు కట్టడానికి ముందు స్థానికంగా .. ⁠బడుల మీద, మౌలిక వసతుల కల్పన మీద ఉండాలని చెప్పడం తప్పు కాదన్నారు. 

Continues below advertisement

TTD నిధులతో TTD నే స్వయంగా గుడులు కడితే అభ్యంతరం ఎవరికి ఉండదు.  ⁠మేము లేవనెత్తిన సమస్యల్లా TTD నిధులతో కట్టే దేవాలయాలకు స్వయంగా ముఖ్యమంత్రి  ప్రమోషన్ చేసుకోవడం ఏంటనేదేనని స్పష్టం చేశారు.  ⁠ఒక మతానికి పెద్ద దిక్కులా ముఖ్యమంత్రి మాట్లాడకూడదు... ⁠తాను ప్రకటించే నిర్ణయాలు అన్ని మతాలకు సమానంగా ఉండాలన్నారు.  ⁠కూటమి ప్రభుత్వంలో, బీజేపీతో కలిసున్న సీఎం  ⁠మిగతా మతాలకు అభద్రతాభావం కలిగించకూడదుని  మేమేదో హిందూ ధర్మానికి, హిందువులకు వ్యతిరేకులమని చూపించే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

⁠రాష్ట్రంలో మళ్లీ పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై,  ⁠వ్యక్తిగతంగా నాపై BJP, RSS మత ఛాందస వాదులు విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.  ⁠హిందువులను కావాలని రెచ్చగొడుతున్నారు. పీఠాధిపతులతో తిట్టిస్తున్నారని..  ⁠నా వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ఉద్దేశ్యాన్ని మత పిచ్చి RSS, BJP వాదులు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు.  ⁠మత రాజకీయాలు చేసి లబ్ది పొందేందుకు BJP, RSS చేస్తున్నవి నీచ రాజకీయాలని..  హిందూ ధర్మానికి, మతానికి, నేను గానీ కాంగ్రెస్ పార్టీ గానీ ఎంత మాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేసారు.     

Continues below advertisement

⁠కాంగ్రెస్ పార్టీ సర్వమత సమ్మేళనం. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళం.  ⁠ఒక మతానికి ఒక న్యాయం, మరో మతానికి అన్యాయం ఇది కాదు కాంగ్రెస్ సిద్ధాంతమన్నారు.  ⁠పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపితే, ⁠భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, ఇది ఘోర అపచారం అని,  ⁠వెంటనే CBI దర్యాప్తుకు ఆదేశించాలని మొదట డిమాండ్ చేసింది తానేనని గుర్తు చేశారు.  ప్రజల పక్షాన మా డిమాండ్ లో మంచిని వెతకకుండా,  దానికి చంద్రబాబు  సమాధానం చెప్పకుండా , కుహనా మేధావులతో మాట్లాడించడం సిగ్గుచేటన్నారు. 

⁠ప్రజల కోసం మేము మాట్లాడితే, మతం కోసం RSS, బీజేపీ మాట్లాడుతుంది .  ⁠ఎవరు మత పిచ్చిగాళ్లో, ఎవరు మత విద్రోహులో, విషం చిమ్మేది ఎవరో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసన్నారు.  ⁠TTD ని గుంజడం కాదు .. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే .. ⁠మేము లేవనెత్తిన అంశాల మీద ప్రభుత్వ పరంగా సమాధానం ఇవ్వాలని సవాల్ చేశారు.