Sharmila demands  not to build temples in Dalit villages:  దళితవాడల్లో TTD నిధులతో గుడులు కట్టమని ఎవరు అడిగారని ఏపీ ప్రభుత్వాన్ని షర్మిల ప్రశ్నించారు.  TTD చాలా పవిత్రమైన గుడి..కాదని ఎవరు అనరు ..  TTD దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే గుడులు కాదు దళితవాడల్లో మౌలిక వసతులు కల్పించాలని స్పష్టం చేశారు.  SC వెల్ఫేర్ హాస్టల్స్ లో 200 మంది విద్యార్థినిలకు ఒకటే బాత్ రూమ్ ఉందంటున్నారని..  ఆ డబ్బులతో ఆ బిడ్డలకు హాస్టల్స్ లో కనీస వసతులు కల్పించాలన్నారు.  దళితవాడల్లో 5 వేల గుడులు కడితే పూజారులను దళితులను పెడతారా అని ప్రశ్నించారు.  5 వేల గుడులు కట్టాలనుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.  భారత దేశం సర్వమతల సమ్మేళనం. కానీ చంద్రబాబు RSS రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో మీడియాతో  మాట్లాడిన షర్మిల పలు కీలక అంశాలపై కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 

Continues below advertisement

చంద్రబాబు రైటిస్ట్ విధానాన్ని ఎంచుకున్నారుని..  బీజేపీ ఒక మత తత్వ పార్టీ అన్నారు.  మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీ .. మతం పేరిట మాటలు రాజేసి అందులో చలి కాచుకునే పార్టీ బీజేపీ అన్నారు.   కేంద్రంలో ఇవ్వాళ బీజేపీ అధికారంలో ఉంది అంటే బాబు మద్దతు తోనేనని గుర్తు చేశారు.  ఈ మధ్య ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో RSS అభ్యర్థికి బాబు మద్దతు ఇవ్వడంతో ఆయన బీజేపీ అని తేటతెల్లం అయ్యిందన్నారు.   మిత్ర ధర్మం ముసుగులో చంద్రబాబు RSS లో పూర్తిగా చేరిపోయారు... అందుకే RSS వాది లా మాట్లాడుతున్నారన్నారు.  దళితవాడల్లో ఇప్పుడు గుడులు కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు 

రాజ్యాంగానికి వ్యతిరేకంగా RSS సిద్ధాంతాన్ని నెత్తిన ఎత్తుకొని దేశ వ్యాప్తంగా గుడులు కట్టడం సరికాదని..   మన ప్రజాస్వామ్యం సెక్యులరిజం అన్ని మతాలకు స్వేచ్ఛ మన రాజ్యాంగం ఇచ్చింది..  దేశంలో RSS రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్నారన్నారు.  RSS రాజ్యాంగంలో హిందువులు మాత్రమే మనుషులు..మిగతా మతస్తులు అంతా పురుగులుగా RSS రాజ్యాంగం చూస్తుందన్నారు.   చంద్రబాబు కి దళితుల మీద శ్రద్ధ ఉంటే వారి అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.  దళిత కాలనీల్లో పారిశుధ్యం మీద దృష్టి పెట్టండి.. వారికి కావలసిన కనీస వసతులను మెరుగు పరచండి..5 వేల గుడులు కట్టే నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని దళితవాడల అభివృద్ధి మీద దృష్టి పెట్టండి అని డిమాండ్ చేశారు. 

Continues below advertisement

 దేశంలో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందని..  బీజేపీ గెలుపు కష్టం అనుకున్న చోట దొంగ ఓట్లను చేరుస్తున్నారని ఆరోపించారు.  బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారు.. ఓట్లను ఇతర నియోజక వర్గాలకు తరలిస్తున్నారన్నారు.   రాజ్యాంగం మనకు ఇచ్చింది ఓటు హక్కు.. అందరినీ సమానంగా చూసేది ఓటు మాత్రమే.. ఇలాంటి ఓటు వ్యవస్థను బీజేపీ కలుషితం చేసిందని మండి పడ్డారు.  అందుకే బీజేపీ మీద దేశ వ్యాప్త ఉద్యమం చేపట్టాం.. అన్ని రాష్ట్రంలో సంతకాల సేకరణ ఉద్యమంలా సాగుతుంది.. ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది.. బీజేపీ ఓట్ చోరీ విధానాలను ప్రజలు తెలుసుకున్నారన్నరాు.  EC సైతం బీజేపీ గుప్పిట్లో ఉందని..  ఎన్నికల సంఘం బీజేపీ తొత్తుగా మారిందని ఆరోపించారు.  మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్నికలకు 5 నెలల ముందు 60 లక్షల కొత్త ఓట్లు చేర్చారని.. బీజేపీ అధికారంలో ఉండేందుకు ఇన్ని కుట్రలు చేసిందన్నారు.  రాహుల్ గాంధీ ECI ముందు పలు డిమాండ్ లు పెడితే ఇంతవరకు స్పందన లేదని..  CC ఫుటేజ్ ఇవ్వమని అడిగితే స్పందన లేదని షర్మిల ప్రశ్నించారు.