Vijayasai Reddy  :  వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి సమస్యలు తప్పడం లేదు.  ఏపీలో రాక్షస పాలన సాగుతోందని ఢిల్లీలో ధర్నా  చేసిన వైసీపీ అధినేతకు మద్దతుగా జంతర్ మంతర్ లో ఉన్న విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా అదే దేవాదాయశాఖ సస్పెండెడ్ డిప్యూటీ కమిషనర్ శాంతి   భర్త మదన్ మోహన్ ఆందోళన చేశారు. ఇతర ప్రజాసంఘాలతో కలసి వచ్చి ఆయన జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. తన భార్య శాంతికి మాయ మాటలు చెప్పి విజయసాయిరెడ్డి మోసం చేశారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేయాలని... ఆయనను డీఎన్‌ఏ టెస్టుకు పిలవాలని డిమాండ్ చేశారు. 


వైసీపీ ధర్నా చేస్తున్న జంతర్ మంతర్‌లోనే మదన్ మోహన్ ధర్నా                               


దేవాదాయశాఖలో డిప్యూటీ కమిషనర్ గా పని చేస్తున్న తన భార్యను విజయసాయిరెడ్డితో పాటు వైసీపీకి లాయర్ గా పని చేస్తున్న  సుభాష్ రెడ్డి మభ్యపెట్టి మోసం చేశారని అన్నారు. అక్రమంగా బిడ్డను కన్నారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన భార్యతో అనేక చట్ట విరుద్ధమైన పనులు చేయించారని.. కొన్ని వేల కోట్లు విలువైన భూముల్ని దోచుకున్నారని మండిపడ్డారు. వారు చాలా పెద్ద తప్పు చేశారని .. విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్టుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. విజయసాయిరెడ్డికి రాజ్యసభలో ఉండే అర్హత లేదన్నారు. 


విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని   డిమాండ్                                        


ఓ గిరిజన మహిళను విజయసాయిరెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని గిరిజన సంఘాల జేఏసీ నేత సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చేందుకు తాము  ఢిల్లీకి వచ్చామన్నారు. డబ్బు బలం ఉపయోగించి జగన్ మదన్ మోహన్ ను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు . విజయసాయిరెడ్డి సభ్యత్వాన్నిరద్దు చేయాలని గురువారం తాము స్పీకర్ తో పాటు రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.


రేపు స్పీకర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్న మదన్ మోహన్                                    


విజయసాయిరెడ్డి ఇటీవల ఓ ప్రకటన చేశారు. కూతురిగానే భావించి శాంతికి అన్ని  రకాల సహాయం చేశానని అంతకు మించి దురుద్దేశం లేదన్నారు. బిడ్డ పుడితే వెళ్లి పరామర్శించానని.. తన ఇంటికి వస్తే ఆశీర్వదించానన్నారు. తనకు ఎవరితోనూ అక్రమ సంబంధాలు లేవని స్పష్టం చేశారు. శాంతి కూడా అదే చెబుతున్నారు. అయితే శాంతి భర్త మదన్ మోహన్ మాత్రం.. ఖచ్చితంగా విజయసాయిరెడ్డి డీఎన్‌ఏ టెస్టుకు రెడీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ బిడ్డకు తండ్రిగా శాంతి  సుభాష్ రెడ్డి అనే లాయర్ పేరు చెప్పారు. కానీ సుభాష్ రెడ్డి ఆ బిడ్డతో తనక సంబందం లేదని చెబుున్నారని మదన్ మోహన్ చెబుతున్నారు. అందుకే బిడ్డ ఎవరి బిడ్డో తేలాలని మదన్ మోహన్ డిమాండ్ చేస్తున్నారు.