Andhra News : రాయలసీమకు సాగునీటి గండం పొంచి ఉందని మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పర్ పెన్నర్ నిర్మాణంతో అనంతపురం జిల్లాకు నీరు రాదన్నారు. హార్టికల్చర్ లో ప్రథమ స్థానంలో ఉన్న అనంతపురం జిళ్లా ఇవాళ రైతులు భయపడుతున్నారని.. భూగర్భజలాలు అగుగంటిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు అధికార పార్టీ నేతలకు ఇసుక, మట్టిపై ఉన్న మమకారం మరేదానిపై లేదన్నారు. కాలువలకు నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా నాయకులు రాజకీయాలు పెక్కన పెట్టి సాగు తాగునీటికోసం పోరాడాలని.. విద్యుత్ మోటర్లకు 2 గంటలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్ పోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఉత్సహ పడుతున్నారు.. ఎందుకో అర్థం కావడం లేదన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో తాము అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సీనియర్ నేత పొన్నాల పార్టీని వీడడం బాధాకరమన్నారు. పొన్నాల పార్టీ నుంచి వెళ్లకుండా రేవంత్ రెడ్డి మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. ఎమ్మెల్యే టికెట్లు సీనియర్ నేతలు సి డబ్ల్యూ సి సమావేశం ఏర్పాటు చేసుకొని అందరి అభిప్రాయాలు తెలుసుకొని ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తారని.. రేవంత్ రెడ్డి టికెట్ల కోసం డబ్బులు తీసుకుంటున్నాడు అన్నది అవాస్తవమని స్పష్టం చేశారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను... రాష్ట్రాల వారీగా కేటాయించడానికి ప్రత్యేకంగా ట్రిబ్యూనల్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. దీని వల్ల ఏపీ రైతలకు ముఖ్యంగా రాయలసీమ రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని.. నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం దీనిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకుంది. ముందుగా ప్రధానమంత్రికి లేఖ రాసి ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్పీ దాఖలు చేయాలనుకుంది. కానీ ఇంకా లేఖ రాయలేదు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి పిటిషన్లు ఏపీ ప్రభుత్వం వేసిన తమ వాదన వినాలని కేవియట్ దాఖలు చేసింది.
మరో వైపు కర్ణాటకలో అప్పర్ భద్ర నిర్మాణం కోసం బీజేపీ ఎన్నికలకు ముందు అనుమతులు ఇచ్చింది. నిధులు మంజూరు చేసింది. ఈ అప్పర్ భద్రను నిర్మిస్తే.. రాయలసీమకు పూర్తి స్థాయిలో నీటి కటకట ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణుల అంచనా. అందుకే అనంతపురం వాసుల్లో సాగునీటి సమస్యలపై ఆందోళన వ్యక్తమవుతోంది.