Sajjala :  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్టై జైల్‌లో ఉండడమే తప్పన్నట్లు టీడీపీ వాళ్లు మాట్లాడుతున్నారని.. వాళ్ల దబాయింపులకు మేం సమాధానం ఇవ్వాల్సి వస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించిన సజ్జల.. టీడీపీ విమర్శలకు   కౌంటర్‌ ఇచ్చారు. 


చంద్రబాబు జైల్లో ఉండటం తప్పా ?: సజ్జల 
  
బాబు జైల్లో ఉండడమే తప్పైనట్లు టీడీపీ వాళ్లు మాట్లాడుతున్నారు. హౌజ్‌ కస్టడీలో ఉంటే దాన్ని అరెస్ట్‌ అంటారా? ఇంట్లో ఉంచేదానికి అరెస్ట్‌ చేయడం ఎందుకు? బాబును హింసిస్తున్నారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. దొంగల్ని పట్టుకుంటే ఎందుకంత హడావిడి.  టీడీపీ హడావిడితో అసలు విషయం పక్కకి పోతోంది. కోర్టు కూడా ఏకీభవించాక.. ఈ హడావిడి ఎందుకు?. గోబెల్స్‌ ప్రచారం చేస్తే తప్పులు ఒప్పులు అయిపోవు. దేశంలో ఉండే చట్టాలకు చంద్రబాబు అతీతుడా? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.  సానుభూతి, రాజకీయ ప్రయోజననాల కోసమే బాబు పాకులాడారు. యువత పేరు చెప్పి చంద్రబాబు దోచుకున్నారు. దొంగను అరెస్ట్‌ చేస్తే మానవహక్కుల ఉల్లంఘన ఎలా అవుతుందన్నారు.  అయినా.. అరెస్ట్‌ అయ్యాక ఎవరికీ ఇవ్వని సౌకర్యాలు చంద్రబాబుకి కల్పించారు అని సజ్జల తెలిపారు.  


నేషనల్ ఏజెన్సీలు కూడా దర్యాప్తు చేశాయి : సజ్జల 


టీడీపీ ప్రభుత్వంలో డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి. కుట్రలతో కూడిన యజ్ఞంలా ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు. స్కిల్‌ స్కామ్‌తో ప్రభుత్వ ఖజానాకు నేరుగా నష్టం వాటిల్లింది. దోచుకోవడానికే ఓ స్కీమ్‌ పెట్టారు. షెల్‌ కంపెనీల ద్వారా క్యాష్‌గా మార్చుకున్నారు. రాష్ట్ర ఖజానాకు వందల కోట్ల నష్టం కలిగించారు.   పక్కా ఆధారాలతో సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌ ఇచ్చింది. నేషనల్‌ ఏజెన్సీలు కూడా దోపిడీ రిపోర్ట్‌ ఇచ్చాయన్నారు. 2019 ఏప్రిల్‌లోనే సీమెన్స్‌ ఇన్వెస్టిగేషన్‌ రిపోర్ట్‌ ఇచ్చింది. సీమెన్స్‌ ప్రతినిధులు మాకు సంబంధం లేదని చెబుతున్నారు. ఎలాంటి అగ్రిమెంట్‌ చేసుకోలేదని అంటున్నారు. అసలు మాకు డబ్బు రాలేదని సీమెన్స్‌ సంస్థ అంటోంది. డబ్బు టెక్‌డిజైన్‌కు వెళ్లింది.. అక్కడి నుంచి షెల్‌ కంపెనీలకు వెళ్లింది. ఈడీ కూడా హవాలా వ్యవహారంపై  దర్యాప్తు చేసింది. ఈడీ విచారణ ఎదుర్కొన్న డిజైన్‌టెక్‌​ వాళ్లవి దబాయింపులేనన్నారు. 
 
ఫైల్స్‌ను చంద్రబాబు ధ్వంసం చేశారు : సజ్జల 


చంద్రబాబు  అవినీతి  కి  అన్ని  ఆధారాలు  ఉన్నాయని స్పష్టం చేశారు.  సిమెన్స్  కంపెనీ  మాకేం  సంబంధం  లేదని  చెప్పిందని..  గట్టిగా  అరుస్తుంటే  అబద్ధం  నిజం  అవుతుందని  చూస్తున్నారన్నారు.   చంద్రబాబు  అవినీతి నిరూపణ కు  పెద్ద  పెద్ద  లాయర్లు   పెద్ద  జ్ఞానం  అవసరం  లేదు...సామాన్యులను  అడిగినా  చెప్తారన్నారు.   అప్పటి   ఫైల్స్  మొత్తం  బాబు   ధ్వంసం  చేశారని ఆరోపించారు.