అన్వేషించండి

Rajahmundry District Court: రాజ‌మండ్రి జిల్లా కోర్టుకు బాంబు బెదింరింపు! ఒక్క రోజంతా హై టెన్ష‌న్‌! చివ‌ర‌కు పోలీసులు ఏం తేల్చారంటే?

Rajahmundry: న్యాయ‌స్థానాల‌కు బాంబులు పెట్టామ‌ని ఈమెయిల్స్ రావడంతో పోలీసులు ముమ్మ‌ర త‌నిఖీలు చేప‌ట్టారు. దీంతో రాజ‌మండ్రి జిల్లా కోర్టులో డాగ్‌స్వ్కాడ్స్‌, మెట‌ల్ డిటెక్ట‌ర్ల‌తో జ‌ల్లెడ ప‌ట్టారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Rajahmundry: రైల్వే స్టేషన్‌కు, బ‌స్ స్టాండ్ల‌లో బాంబు ఉందంటూ అప‌రిచిత వ్య‌క్తుల నుంచి ఫోన్ కాల్స్ వ‌చ్చిన ఘటనలు చాలానే ఉన్నాయి. దీంతో మొత్తం పోలీసు యంత్రాంగమంతా అప్ర‌మ‌త్త‌మవుతుంది. వెంట‌నే ఆ ప్రాంతం అంతా తమ స్వాధీనంలోకి తీసుకుని డాగ్ స్క్వాడ్‌, బాంబ్‌ ల‌ను గుర్తించే ప్ర‌త్యేక బృందాలతో గాలిస్తారు. ముమ్మ‌రంగా త‌నిఖీలు చేప‌ట్టి అంద‌రినీ అప్ర‌మ‌త్తం చేసి అక్క‌డి నుంచి పంపించి వేస్తారు. ఇదంతా ఒక సినిమాల్లో చూపించినట్టుగానే టెన్షన్ టెన్షన్‌గా ఉంటుంది. స‌రిగ్గా ఇటువంటి ఘ‌ట‌నే తూర్పుగోదావ‌రి జిల్లాలోని రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జిల్లా కోర్ట‌ులో బుధ‌వారం జరిగింది. 

ఏపీలోని ప‌లు న్యాయ‌స్థానాల‌కు బాంబులు పెట్టామ‌ని బెదిరిస్తూ ఈమెయిల్ రావ‌డంతో అప్ర‌మ‌త్తం అయ్యారు అధికారులు. ఇటువంటి మెయిల్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జిల్లా కోర్టుకు రావ‌డంతో అప్ర‌త‌మ‌త్త‌మైన న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. జిల్లా న్యాయ స్థానానికే ఈ త‌ర‌హా బెదిరింపులు రావ‌డంతో వెంట‌నే జిల్లా ఎస్పీ న‌ర‌సింహ కిషోర్ అక్క‌డ‌కు చేరుకుని మొత్తం పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దింపి కోర్టు లోప‌ల‌, బ‌య‌ట ప్రాంగ‌ణం అంతా త‌నిఖీలు చేయించారు.. 

న్యాయ‌వాదుల‌ను, క‌క్షిదారుల‌ను బ‌య‌ట‌కు పంపించిన పోలీసులు...

రాజ‌మండ్రి జిల్లా కోర్టుకు బాంబు బెదింరింపులు రావ‌డంతో ఒక్క‌సారిగా ఆ ప్రాంతమంతా అల‌జ‌డి రేగింది. మొద‌ట్లో ఈ విష‌యం బ‌య‌ట‌కు తెలియ‌క‌పోయినా పోలీసులు ప్ర‌వేశంతో ఈ విష‌యం దావానంలా వ్యాపించింది. అయితే ఈ విష‌యం తెలుసుకున్న న్యాయవాదులు, క‌క్షిదారులు, సిబ్బంది అంతా ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. పోలీసులు న్యాయవాదుల‌ను, క్ష‌క్షిదారుల‌ను అక్క‌డి నుంచి పంపించి వేశారు. పోలీసు జాగిలాలు, మెట‌ల్ డిటెక్ట‌ర్ల‌తో కోర్టు ప్రాంగ‌ణం అంతా జ‌ల్లెడ ప‌ట్టారు. 

పోలీసులు ఏం తేల్చారంటే...

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపుల వేళ ముమ్మ‌రంగా త‌నిఖీలు చేప‌ట్టిన పోలీసుల‌కు అక్క‌డ ఏం ల‌భించ‌లేదు. సుమారు సాయంత్రం వ‌ర‌కు ఈ త‌నిఖీలు చేప‌ట్టినా ఎటువంటి అనుమానాస్ప‌ద వస్తువులు ల‌భ్యం కాక‌పోవ‌డంతో ఇది ఆక‌తాయిల ప‌ని అని ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాలి..

ఏపీలో ప‌లు కోర్టుల‌కు బాంబులు పెట్టామ‌ని బెదిరిస్తూ మెయిల్ వ‌చ్చింద‌ని, ఈ మెయిల్ ప్రాతిప‌దిక‌నే రాజ‌మండ్రి జిల్లా కోర్టు నుంచి కూడా జిల్లా ఎస్పీకు స‌మాచారం అందించార‌ని ప్ర‌ముఖ సీనియ‌ర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు. బెదిరింపుల మెయిల్ అనేది ఫేక్ అయిన‌ప్ప‌టికీ స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేపట్టాల‌ని, అది ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో ఎవరు చేశారో అన్న‌ది సైబ‌ర్ క్రైమ్ ద్వారా విచార‌ణ చేప‌ట్టి ప‌ట్టుకోవాల‌న్నారు. ఇటువంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాల‌న్నారు. కోర్టు ప్రాంగ‌ణంలో సీసీ కెమెరాలు పెట్టాల‌ని, రాత్రిపూట కోర్టు ప్రాంగ‌ణంలోకి ఎవరూ చొర‌బ‌డ‌కుండా చూడాల‌ని ఆయ‌న కోరారు. 

Frequently Asked Questions

రాజమండ్రి జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు ఎలా వచ్చాయి?

ఏపీలోని పలు న్యాయస్థానాలకు బాంబులు పెడతామని బెదిరిస్తూ వచ్చిన ఈమెయిల్‌కు ప్రతిస్పందనగా రాజమండ్రి జిల్లా కోర్టుకు కూడా ఈ బెదిరింపు వచ్చింది.

బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, డాగ్ స్క్వాడ్, బాంబులను గుర్తించే ప్రత్యేక బృందాలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

తనిఖీల్లో పోలీసులకు ఏమైనా అనుమానాస్పద వస్తువులు లభించాయా?

సుమారు సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగినా, పోలీసులకు ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఇది కేవలం ఆకతాయి పని అని ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ ఘటనపై న్యాయవాదులు ఏమని అభిప్రాయపడ్డారు?

బెదిరింపుల ఈమెయిల్ నకిలీ అయినప్పటికీ, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, సైబర్ క్రైమ్ ద్వారా మూలాలను గుర్తించాలని ఒక సీనియర్ న్యాయవాది కోరారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
Kakinada Latest News:కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
Pithapuram Latest News: చంద్ర‌బాబుకే గుర్తింపు లేదంటే ఇక మా ప‌రిస్థితేంటి? పిఠాపురంలో వర్మకు మళ్లీ కోపమొచ్చింది! 
చంద్ర‌బాబుకే గుర్తింపు లేదంటే ఇక మా ప‌రిస్థితేంటి? పిఠాపురంలో వర్మకు మళ్లీ కోపమొచ్చింది! 
Konaseema Latest News: కోన‌సీమలో కాశ్మీర్ అందాలు! వేసవిలోనూ వీడని మంచు దుప్పటి!
కోన‌సీమలో కాశ్మీర్ అందాలు! వేసవిలోనూ వీడని మంచు దుప్పటి!
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Ustaad Bhagat Singh Trailer : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
Vishwanath And Sons Teaser : విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
Embed widget