ఆహారం తీసుకోకపోవడం, విచిత్ర ప్రవర్తన కారణంగా శునకం మృతి చెందింది. దర్యాప్తులో కీలక ఆధారం కోల్పోయామని పోలీసులు ఆందోళన చెందుతున్నారు.
Jnaneshwari Missing Case: మిస్టరీగా మారిన తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసు! పాపపై బెంగతో కుక్క ఆకస్మిక మృతి! దర్యాప్తు ముందుకు సాగుతుందా?
Jnaneshwari Missing Case: తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క అకస్మాత్తుగా మృతి చెందింది.

- తునిలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం.
- చిన్నారి ఆచూకీకై, కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి వెతికారు.
- ఆహారం తీసుకోక, విచిత్ర ప్రవర్తనతో పెంపుడు కుక్క మరణించింది.
- పోలీసులు ప్రస్తుతం కిడ్నాప్, జంతువుల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
- చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక సాక్షిగా, ఆధారంగా భావించిన పెంపుడు కుక్క అకస్మాత్తుగా మృతి చెందింది.
- హైటెక్ జీపీఎస్ ట్రాకర్ల సాయంతో 8 కిలోమీటర్ల మేర గాలించినా చిన్నారి జాడ లభించలేదు.
- ఆహారం తీసుకోకపోవడం, విచిత్ర ప్రవర్తన వంటి కారణాల వల్ల శునకం మరణించింది.
కాకినాడ జిల్లా తుని మండలంలో రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి (జాహ్నవి) అదృశ్యం కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఆ చిన్నారి మిస్సింగ్ కుటుంబ సభ్యులనే కాకుండా పెంపుడు కుక్కను కలవరానికి గురి చేసింది. అందుకే ఆ చిన్నారితో పాటు వెళ్లిన కుక్క ఇంటికి వస్తూ చిన్నారి వెళ్లిన ప్రాంతాలకు వెళ్తూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించింది. ఇలా పాపపై బెంగతో నిద్రాహారాలు మానేసింది. దిగులుతో ఈ ఉదయం అకస్మాత్తుగా మృతి చెందింది. ఇది కూడా స్థానికంగా తీవ్ర విషాదానికి కారణం అయ్యింది.
చిత్ర విచిత్రగా కుక్క ప్రవర్తన
దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారం గ్రామంలో గత శనివారం చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి... ఉన్నట్టుండి పెంపుడు కుక్కతో కలిసి కనిపించకుండా పోయింది. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత పెంపుడు కుక్క తిరిగి గ్రామానికి చేరుకుంది. కానీ పాప మాత్రం రాలేదు. కుక్క ప్రవర్తన అప్పటి నుంచి విచిత్రంగా మారడం పోలీసుల్లో అనుమానాలు రేకెత్తించింది.
హైదరాబాద్ నుంచి పరికరాలు తెప్పించి అమరిక
శునకం మనుషులను చూసి భయపడటం, పారిపోవడానికి ప్రయత్నించింది. కుక్క ప్రవర్తన చూసిన వారంతా ఏదో జరిగిందని అనుమానపడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కొందరు యువకులు కుక్కను చాకచక్యంగా ఆ కుక్కను పట్టుకోగలిగారు. పాప ఎక్కడుందో కుక్కకు తెలుస్తుందని భావించిన పోలీసులు దానికి అత్యాధునిక జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఈ పరికరం ద్వారా కుక్క కదలికలను గమనించారు.
8 కిలోమీటర్ల పరిధిలో ఏం జరిగింది?
శునకం సుమారు 80 నిమిషాల పాటు అడవిలో 8 కిలోమీటర్ల మేర సంచరించింది. అది ఎక్కడెక్కడైతే తిరిగిందో ఆప్రాంతాలన్నింటినీ పది పోలీసులు బృందాలు , 40 మంది ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది జల్లెడ పట్టారు. దురదృష్టవశాత్తు ఆ 8 కిలోమీటర్ల పరిధిలో చిన్నారికి సంబంధించిన ఎలాంటి క్లూ లభించలేదు. చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్ మెటల్ డిటెక్టర్లను కూడా రంగంలోకి దించారు.
కుక్క గత రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో దాని ఆరోగ్యం క్షీణించింది. వెటర్నరీ వైద్యులు దానికి చికిత్స చేశారు. అయినా ఈ ఉదయం ఒక్కసారిగా కుప్పకూలి మరణించింది. శునకం మృతి చెందడానికి ముందు రోజు రాత్రి దీనికి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత అది మరణించడంతో ఆ మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయి. జానును తీసుకొస్తావా అని చిన్నారి తల్లి ఆ కుక్కతో అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరిని కన్నీరు పెట్టిస్తోంది. కానీ ఆ మూగజీవి ఇప్పుడు శాశ్వతంగా కన్నుమూసింది.
పోలీసులు ఈ కేసును ఇప్పుడు మనుషుల కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా అడవి జంతువులు ఏమైనా లాక్కెళ్లాయా అన్న కోణంలో విచారణ సాగుతోంది. చుట్టుపక్కల గ్రామాల వ్యక్తులు , కొత్తగా వచ్చిన వారు, గంజాయి. అలవాటు ఉన్న వారు, ఇలా అందర్నీ పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు. మొబైల్ టవర్ డేటా, సీసీ కెమెరాల ఫుటేజ్ని కూడా విశ్లేషిస్తున్నారు.
మూగజీవి ప్రాణాలు కోల్పోవడంతో దర్యాప్తులో ఒక పెద్ద ఆధారం పోయిందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ జ్ఞానేశ్వరి ఆచూకీ లభించే వరకు గాలింపు ఆపేది లేదని పెద్దాపురం డీఎస్పీ తిలక స్పష్టంచేశారు. చిన్నారి ఆదృశ్యమై వారం గడిచిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అడవిలో ఉన్న క్రూరమృగాల భయం ఒకవైపు, కిడ్నాపర్ల చేశారా అన్న ఆందోళన మరోవైపు తల్లిదండ్రులను పట్టిపీడిస్తుంది.
Frequently Asked Questions
చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో పెంపుడు కుక్క మరణానికి కారణం ఏమిటి?
జ్ఞానేశ్వరిని కనుగొనడానికి పోలీసులు ఏ టెక్నాలజీని ఉపయోగించారు?
పోలీసులు పెంపుడు కుక్కకు అత్యాధునిక జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చారు. చిన్నారి వెండి పట్టీల కోసం సిల్వర్ మెటల్ డిటెక్టర్లను కూడా రంగంలోకి దించారు.
జ్ఞానేశ్వరి అదృశ్యంపై పోలీసులు ప్రస్తుతం ఎలా దర్యాప్తు చేస్తున్నారు?
పోలీసులు మానవ కిడ్నాప్ లేదా అడవి జంతువుల దాడి కోణంలో విచారిస్తున్నారు. మొబైల్ టవర్ డేటా, సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















