అన్వేషించండి

Jnaneshwari Missing Case Tuni:జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?

Jnaneswari Missing Case Tuni:కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన రెండేళ్ల జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు వినూత్న ఆపరేషన్ టాయ్‌ చేపట్టారు. అడవి జంతువుల అనుమానంతో బొమ్మలు, కెమెరాలతో వేట సాగిస్తున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తునిలో జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు మార్చారు.
  • 'ఆపరేషన్ టాయ్' తో జంతువుల పాత్ర నిర్ధారించేందుకు ప్రయత్నం.
  • మాంసం నింపిన బొమ్మలు అమర్చి కెమెరాలతో నిఘా పెట్టారు.
  • కొండప్రాంతంలో అడవి జంతువుల సంచారంపై దృష్టి సారించారు.

Gnaneswari Missing Case Tuni:కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారం గ్రామం ప్రస్తుతం ఒక తెలియని ఆందోళనలో ఉంది. రెండేళ్ల పసిపాప జ్ఞానేశ్వరి ఆదృశ్యం కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. చిన్నారి అదృశ్యమై రోజులు గడుస్తున్నా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులు ఇప్పుడు రూట్ మార్చారు. సంప్రదాయపద్ధతులతోపాటు శాస్త్రీయ, వినూత్న పద్ధతులను అమలు చేస్తున్నారు. గ్రామ శివారులో కొండ ప్రాంతం, అటవీ సరిహద్దుల వద్ద ఈ దర్యాప్తును కేంద్రీకృతం చేశారు. ఇక్కడ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ టాయ్‌ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

ఏంటీ ఈ ఆపరేషన్ 

సాధారణంగా నేరస్తులను పట్టుకోవడానికి పోలీసులు డెకాయ్ ఆపరేషన్లు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక చిన్నారిని గుర్తించడానికి లేదా ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇప్పుడు ఆపరేషన్ టాయ్‌ చేపట్టారు. చిన్నారి జ్ఞానేశ్వరి శరీర ఆకృతిని పోలి ఉండే రెండు బొమ్మలను పోలీసులు ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ బొమ్మలను పాప అదృశ్యమైనట్టు భావిస్తున్న ప్రదేశంలో ఉంచారు. అడవి జంతువులను ఆకర్షించేలా ఆ బొమ్మలలో కొంత మాంసాహారాన్ని కూడా అమర్చారు. ఇది వినడానికి వింతగా ఉన్నా, ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న ప్రక్రియ. 

ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?

సీహెచ్‌ అగ్రహారం గ్రామం కొండ ప్రాంతానికి ఆనుకొని ఉంటుంది. అక్కడ అడవి జంతువులు, ముఖ్యంగా కొండచిలువలు, ఇతర క్రూర మృగాల సంచారం ఉండే అవకాశం ఉంది. ఒకవేళ పాపపై ఏదైనా  జంతువు దాడి చేసి ఉంటే, అదే జంతువు మళ్లీ అదే ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంటుంది. మాంసం వాసన ఆ జంతువుల త్వరగా ఆకర్షిస్తుంది. జంతువుల ద్వారా ప్రమాదం జరిగిందా లేదా అన్న సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి పోలీసులకు ఇది ఒక కీలకమైన మార్గంగా కనిపిస్తోంది. 

నిఘా ఎలా చేస్తారు?

బొమ్మలను అమర్చిన ప్రాంతంలో పోలీసులు అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు రాత్రి పూట కూడా స్పష్టమైన చిత్రాలను తీయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఒకవేళ అడవి జంతువులు ఆ బొమ్మల వద్దకు వస్తే, వెంటనే కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. దీని వల్ల పాప అదృశ్యం వెనుక జంతువుల హస్తం ఉందా అనేది స్పష్టమవుతుంది. అటవీ సరిహద్దు కంచె వద్ద ప్రతి అంగుళాన్ని పోలీసులు గాలిస్తున్నారు. గ్రామస్థుల సహకారంతో కొండ ప్రాంతాల్లోని గుహలను, పొదలను కూడా జల్లెడ పడుతున్నారు. 

జ్ఞానేశ్వరి తన ఇంటి వద్ద ఆడుకుంటూ ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడం కేసును మరింత క్లిష్టంగా మారింది. గ్రామస్థులు మొదట కిడ్నాప్‌ కోణంలో ఆలోచించినా, భౌగోళిక పరిస్థితులను బట్టి పోలీసులు అటవీ కోణాన్ని విస్మరించడం లేదు. ప్రస్తుతానికి ఈ టాయ్ ఆపరేషన్ వద్ద ఎలాంటి జంతువుల కదలికలు సమోదయ్యాయనేది పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. త్వరలోనే ఈ కేసులో పురోగతి వచ్చే అవకాశం ఉంది. 

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల ప్రజల తమ పిల్లల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. సాయంత్రం వేళల్లో ఒంటరిగా బయటకు పంపకూడదు. వన్యప్రాణుల కదలికలు ఉన్నప్పుడు స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వడం వల్ల ఇలాంటి అవాంఛనీయ ఘటనలను నివారించవచ్చు. వినూత్న దర్యాప్తు ఫలితాలు ఎలా ఉంటాయోనని జిల్లా ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జ్ఞానేశ్వరి సురక్షితంగా తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Chandrababu Naidu CID Case Quashed: అమరావతి అసైన్డ్‌ భూముల కేసు కొట్టివేత! సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసు కొట్టివేత! సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget