కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీలు ఏం చెబితే అధిష్టానం అదే నమ్ముతుందని, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతోందన్నారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. ఇంఛార్జీల మీదే ఆధార పడటం వల్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతోందంటూ కాంగ్రెస్ అధిష్టానంపై హాట్ కామెంట్స్ చేశారు. రాజ్యసభ సభ్యుడు సుభాష్ చంద్రబోస్, తాను రాజమండ్రిలో కలవడం సాధారణ విషయం, కానీ పార్టీ, రాజకీయాల గురించి కూడా చర్చించాం అన్నారు. వైసీపీలో ఎక్కువగా నష్టపోతోంది ఎస్సీ సామాజిక వర్గమేనని.. ఎస్సీల్లో కొంత గ్యాప్ ఉందని ఎంపీ బోస్ అంగీకరించారని తెలిపారు.
సీఎం జగన్‌కు కూడా ఆ దమ్ము లేదు !
వైఎస్సార్ సీసీ కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ అని.. కాంగ్రెస్ నుంచే వైఎస్సాఆర్ సీపీ పుట్టిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయినా, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయినా అంతా కాంగ్రెస్ పార్టీలోనుంచి వచ్చిన వారేనంటూ మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అనే పేరు తన పార్టీ పేరు నుంచి తీసేసి గానీ, లేక వైఎస్సార్ పార్టీ అనే పేరు పెట్టుకునే దమ్ము జగన్‌కు కూడా లేదన్నారు. పార్టీ మారడానికి ముహూర్తాలు పెట్టలేదని, ఇప్పటికే తాను జనసేనలో చేరడానికి , వైసీపీలో చేరడానికి చాలా ముహూర్తాలు పెట్టారంటూ నవ్వులు పూయించారు. తెలంగాణలో సీనియర్స్‌ను పక్కను పెట్టి జూనియర్స్‌ను తీసుకున్నారని వాదన ఉందన్నారు. అయితే తనకు కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిన పదవి తీసుకోలేదని, అయినా తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఇంఛార్జీలు ఏం చెప్పినా అధిష్టానం నమ్ముతుందని, వారి మీద పూర్తిగా ఆధారపడటంతో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతోందన్నారు.
ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ వల్లే రాష్ట్రం విడిపోయింది !
గ్రౌండ్ లెవెల్ రియాలిటీని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలుసుకోలేకపోతోంది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కారణంగా సమైఖ్యంగా ఉన్నఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిందని, ఆయన ఇంఛార్జిగా ఉండి విడిపోవడానికి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వడం వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా రాజకీయంగా సరైన పోటీ ఎదుర్కోలేకపోతోందన్నారు. పార్టీ మారొచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా సీనియర్లకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోయారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఇంఛార్జ్‌లు డబ్బులకు ప్రలోభపడి పదవులను తప్పుడు రికమెండెషన్‌లు చేసి పదవులను అమ్ముకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ‘పదవులు అమ్ముకోవడం వల్ల ఏపీలో పుంజుకుంటున్న కాంగ్రెస్‌ను నాశనం చేశారు. హైకమాండ్ ఇంకా అధికారంలోనే ఉన్నామన్న బ్రమలోనే ఉంది. రాజరికపు వ్యవస్థలోనుంచి కాంగ్రెస్ బయటకు రాలేకపోతోంది. హైకమాండ్‌లోని పెద్దోళ్లు సామాన్య కార్యకర్తలను కలుసుకోలేకపోతున్నారు. తనకంటే జూనియర్ అయిన పీసీసీ అధ్యక్షుని నేతృత్వంలో ఇతర నేతలు క్యాంపెయినింగ్ ఛైర్మన్‌గా పనిచేయగలరు అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సరైన పద్దతిలో వెళ్లడం లేదని, ఇదివరకే ఏపీలో వచ్చే పార్టీని పూర్తిగా నాశనం చేసేశారు అని’ మాజీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.