అన్వేషించండి

Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!

Man vs Wild | పోలవరం జిల్లాలో పులి కదలికలను సమీప గ్రామాలకు దూరంగా, నేలకోట-పూడిపల్లి సమీపంలోని కొండ ప్రాంతానికే విజయవంతంగా పరిమితం చేశారు.

Tiger Hunt in Polavaram | అమరావతి:  పోలవరం పరిసర ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలోని 'హనుమాన్' (H.A.N.U.M.A.N) ప్రత్యేక రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా వ్యవహరించి రాత్రంతా పహారా కాశాయి. అత్యాధునిక డ్రోన్ కెమెరాల నిఘా, క్షేత్రస్థాయి సిబ్బంది, వన్యప్రాణి నిపుణులు, ప్రత్యేక పశువైద్య బృందాలు పూర్తి సమన్వయంతో రంగంలోకి దిగాయి. పులి జనవాసాల్లోకి రాకుండా, దాని కదలికలను కేవలం నేలకోట– పూడిపల్లి సమీపంలోని కొండ ప్రాంతానికే పరిమితం చేయడంలో ఈ బృందాలు విజయవంతమయ్యాయి.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక ఆపరేషన్ వేగంగా సాగుతోంది. ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా పూర్తి భద్రతను కల్పించడంతో పాటు, పులిని కూడా సురక్షితంగా పట్టుకోవడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో పులి సంచార ప్రాంతాల ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు కోరారు. అలాగే అటవీ శాఖ జారీ చేసే హెచ్చరికలను, సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజలను భయపెట్టిన పెద్దపులి
పోలవరం జిల్లా పరిధిలో గత కొన్ని రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు శనివారం రాత్రంతా ప్రత్యేక ఆపరేషన్‌ను కొనసాగించారు. ప్రస్తుతం దేవీపట్నం మండలం నేలకోట- పూడిపల్లి సొరంగం సమీపంలోని కొండ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు డ్రోన్ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించారు. ఆ పెద్దపులి జనవాసాలు, గ్రామాల వైపు రాకుండా అటవీ శాఖతో పాటు హనుమాన్ రెస్క్యూ బృందాలు గట్టి నిఘా ఏర్పాటు చేశాయి.

Also Read: Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం

ఈ ఆపరేషన్ కోసం బెంగళూరు నుంచి ప్రత్యేకంగా వన్యప్రాణి నిపుణుల బృందం రంగంలోకి దిగింది. పులి కదలికలను నిరంతరం గమనిస్తూ, దాన్ని సురక్షితంగా పట్టుకోవడానికి ఈ బృందం సాంకేతిక సలహాలను అందిస్తోంది. పులి సంచార ప్రాంతాల్లోని గ్రామాల్లో అధికారులు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (మైకుల) ద్వారా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎవరూ ఒంటరిగా బయట సంచరించవద్దని, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: AP Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?

తిరుమలలో ఎలుగుబంటి కలకలం
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమదారిలో శనివారం ఒక ఎలుగుబంటి సంచరించడం కలకలం రేపింది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి సుమారు ఒక కిలోమీటరు దూరంలో ఉండే వినాయక ఆలయం సమీపంలో ఈ ఎలుగుబంటిని భక్తులు గుర్తించారు. ఆహారం, తినుబండారాల కోసం అక్కడ ఉన్న చెత్తకుండీల వద్ద అది వెతుకుతుండటం చూసి తిరుమల యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై సమాచారం అందుకున్న అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు చాకచక్యంగా వ్యవహరించి, ఆ ఎలుగుబంటిని తిరిగి దట్టమైన అటవీ ప్రాంతంలోకి మళ్లించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.



About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
TG20 League Winner: టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
Veg Momos Recipe: ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
Embed widget