అన్వేషించండి

Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పూర్తిస్థాయి ఆడిట్‌కు పవన్ కళ్యాణ్ ఆదేశం.. బోటులో వెళ్లి పరిశీలించిన డిప్యూటీ సీఎం

Godavari Pushkaralu 2027 | గోదావరి పుష్కరాలను 'కాలుష్యరహిత గోదావరి' థీమ్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు, కేంద్ర నిధులతో ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నిర్మించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కాలుష్య నియంత్రణపై తక్షణ ఆడిట్, నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు.
  • గోదావరి, కృష్ణ నదులను కాపాడాలని.. కాలుష్యం తగ్గించాలని పిలుపు.
  • నగర మురుగునీటి శుద్ధిపై దృష్టి.. వ్యర్థాలను నేరుగా నదిలోకి వదలొద్దని హెచ్చరిక.
  • పుష్కరాల నిధులతో ఆధునిక ట్రీట్‌మెంట్ ప్లాంట్లు.. పేపర్ మిల్లు వ్యర్థాలపై కఠిన చర్యలు.

రాజమహేంద్రవరం: గోదావరి నదిలోకి కలిసే కాలుష్యకారక వ్యర్థాలు, మురుగు జలాలు, వాటి నిర్వహణపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉన్నతాధికారులను, తూర్పు గోదావరి జిల్లా అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు కాలుష్య నివారణకు తీసుకున్న చర్యలు ఏంటో తెలపాలని, భవిష్యత్తులో చేయబోయే పనులపై స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.  మనకు జీవితాన్ని ఇచ్చే నదులను చంపవద్దని.. గోదావరి, కృష్ణ నదులను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

వచ్చే 6 నెలల్లో నదుల్లో కాలుష్యం నిర్వహణలో స్పష్టమైన మార్పు కనిపించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను ‘కాలుష్యరహిత గోదావరి’ అనే ప్రత్యేక థీమ్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిశ్చయిందుకుందని వెల్లడించారు. గోదావరి పుష్కరాలు జూన్ 26 నుండి జూలై 7, 2027 వరకు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.


Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పూర్తిస్థాయి ఆడిట్‌కు పవన్ కళ్యాణ్ ఆదేశం.. బోటులో వెళ్లి పరిశీలించిన డిప్యూటీ సీఎం

బోటులో వెళ్లి స్వయంగా పరిశీలించిన ఏపీ డిప్యూటీ సీఎం

రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 6 గంటలకే పవన్ కళ్యాణ్ పుష్కరాల ఘాట్ నుంచి కోటిలింగాలు ఘాట్ వరకు పడవలో ప్రయాణించి, గోదావరి జలాల కాలుష్యకారక ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా గోదావరి పుష్కరాల పనుల తీరును, త్వరలో చేపట్టబోయే ప్రణాళికలను పవన్ కళ్యాణ్ స్వయంగా సమీక్షించారు. గోదావరి గట్ల సుందరీకరణ పనులు ఎంతవరకు వచ్చాయి, పుష్కరాల నేపథ్యంలో గట్లను ఎలా తీర్చిదిద్దబోతున్నారు అనే వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. 

గోదావరిలోకి మురుగునీరు.. నీటిశుద్ధి విధానంపై ఆరాతీసిన పవన్ కళ్యాణ్
ఈ సందర్భంగా చింతలమ్మ ఘాట్ వద్ద నల్లా ఛానల్ ద్వారా రాజమహేంద్రవరం నగర మురుగునీరు గోదావరిలోకి కలిసే ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. నదీ తీరంలో జరుగుతున్న కాలుష్యాన్ని కళ్లారా చూసిన ఆయన, నీటిని శుద్ధి చేస్తున్న విధానంపై ఆరా తీశారు. అక్కడే ఉన్న క్షేత్రస్థాయి సిబ్బందితో మాట్లాడి, వ్యర్థాలను వేరు చేసే పద్ధతులను పరిశీలించారు. నగర గృహాల నుండి రోజువారీగా సుమారు 55 ఎం.ఎల్.డి. మురుగునీరు వస్తోందని, ఈ నీటిని శుద్ధి చేసే విధానం పూర్తిగా శాస్త్రీయంగా జరగాలని అధికారులను ఆదేశించారు. మురుగునీటిని నేరుగా నదిలోకి వదలడం వల్లే జలాలు కలుషితం అవుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని హెచ్చరించారు.

Also Read: YSRCP Political Strategy Failures: వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి!

నిధులను మంచి పనులకు వినియోగించుకుందాం
గోదావరి పుష్కరాలకు ఖర్చు చేసే ప్రతి పైసాను ప్రజలకు ఉపయోగపడేలా, నది తీరాన్ని కాపాడే మంచి పనులకే వినియోగించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేవలం కాగితాల్లో లెక్కలతో సరిపెట్టకుండా పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెళ్లాలని సూచించారు. కేంద్ర జల శక్తి ద్వారా ఎన్.ఆర్.సి.పి. నిధులు రూ. 416 కోట్లలో, ఇప్పటికే రూ. 95 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు వచ్చాయని వెల్లడించారు. ఈ నిధులతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించాలని, పూర్తిస్థాయిలో మురుగు లేకుండా జలాలను శుద్ధి చేసిన తర్వాతే గోదావరిలోకి విడిచిపెట్టే బాధ్యతను అధికారులు తీసుకోవాలని ఆదేశించారు.

అదేవిధంగా ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య జలాలు గోదావరిలోకి విడుదల కావడంపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆరా తీశారు. దీనిపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య స్పందిస్తూ.. ప్రస్తుతం పేపర్ మిల్లు ద్వారా బయటకు వచ్చే వ్యర్థాలను దూరంగా ఉన్న లంక గ్రామాల్లో విడిచి పెడుతున్నారని, దీనికి ప్రత్యామ్నాయంగా ఆ కంపెనీ మరో ప్రాంతంలో శుద్ధి చేసేందుకు యోచిస్తోందని వివరించారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ప్రత్యామ్నాయ పనులు వేగంగా జరిగేలా చూడాలని, అప్పటివరకు సదరు కంపెనీ మరో సొంత శుద్ధి ప్లాంట్ నిర్మించుకునేలా యాజమాన్యానికి కఠిన ఆదేశాలు ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.

Also Read: Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!

బోటు ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి మున్సిపల్ కార్యాలయానికి చేరుకునే వరకు పవన్ కళ్యాణ్ ప్రతి అంశాన్ని పరిశీలించారు. ప్రత్యక్షంగా ట్రీట్‌మెంట్ ప్లాంట్ వద్దకు వెళ్లి వేరు చేస్తున్న వ్యర్థాలను చూసి, వాటిని తర్వాత ఏం చేస్తారని అడిగి తెలుసుకున్నారు. వ్యర్థ జలాల శుద్ధికి సరికొత్త అంతర్జాతీయ విధానాలు వస్తున్నాయని, దానికి అనుగుణంగా అధికారులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలని సూచించారు. అనంతరం పుష్కరాల పనుల ఉన్నత స్థాయి సమీక్ష కోసం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు.

ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర పోలీసు హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్, కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు.

Frequently Asked Questions

గోదావరి నదిలోకి కాలుష్య కారక వ్యర్థాలు, మురుగు నీరు చేరకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు?

కాలుష్య నివారణకు తీసుకున్న చర్యలను వివరించాలని, భవిష్యత్తులో చేయబోయే పనులపై స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

గోదావరి పుష్కరాలను ఏ థీమ్ తో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది?

వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను 'కాలుష్యరహిత గోదావరి' అనే ప్రత్యేక థీమ్ తో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

గోదావరి నదిలోకి మురుగు నీరు చేరకుండా నీటి శుద్ధి విధానంపై పవన్ కళ్యాణ్ ఏమన్నారు?

నగర గృహాల నుండి రోజువారీగా సుమారు 55 ఎం.ఎల్.డి. మురుగునీరు వస్తోందని, నీటిని శుద్ధి చేసే విధానం శాస్త్రీయంగా జరగాలని, మురుగునీటిని నేరుగా నదిలోకి వదలడం వల్లనే జలాలు కలుషితం అవుతున్నాయని అధికారులను ఆదేశించారు.

ఆంధ్ర పేపర్ మిల్లు నుండి వచ్చే కాలుష్య జలాలపై పవన్ కళ్యాణ్ ఏమి స్పందించారు?

ప్రస్తుతం పేపర్ మిల్లు ద్వారా బయటకు వచ్చే వ్యర్థాలను దూరంగా ఉన్న లంక గ్రామాల్లో విడిచి పెడుతున్నారని, దీనికి ప్రత్యామ్నాయంగా ఆ కంపెనీ మరో ప్రాంతంలో శుద్ధి చేసేందుకు యోచిస్తోందని వివరించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Annadata Sukhibhava Status: ఏపీలో అన్నదాత సుఖీభవపై లేటెస్ట్ అప్‌డేట్! ఖరీఫ్‌ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు ఇస్తారంటే?
ఏపీలో అన్నదాత సుఖీభవపై లేటెస్ట్ అప్‌డేట్! ఖరీఫ్‌ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు ఇస్తారంటే?
Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kit:ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ రీఓపెన్‌కు అంతా సిద్ధం! కొత్త యూనిఫామ్, విద్యార్థి మిత్ర కిట్లు ఎప్పుడిస్తారు?
ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ రీఓపెన్‌కు అంతా సిద్ధం! కొత్త యూనిఫామ్, విద్యార్థి మిత్ర కిట్లు ఎప్పుడిస్తారు?
Thalliki Vandanam Scheme AP: ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Actor Karthik : గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
Indian Seafarers Killed Oman:హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
Vastu Tips Telugu: ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
TMC Congress Merger: కాంగ్రెస్‌లో తృణమూల్ విలీనం ప్రచారం - ఫైటర్ దీదీ అంత త్వరగా చేతులెత్తేస్తారా?
కాంగ్రెస్‌లో తృణమూల్ విలీనం ప్రచారం - ఫైటర్ దీదీ అంత త్వరగా చేతులెత్తేస్తారా?
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం.. ఎస్ఎంఎస్1లో ల్యాడిల్‌ నుంచి పడిపోయిన ఉక్కు ద్రవం
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం.. ఎస్ఎంఎస్1లో ల్యాడిల్‌ నుంచి పడిపోయిన ఉక్కు ద్రవం
Embed widget