అన్వేషించండి

Adulterated Milk: రాజమండ్రిలో కిడ్నీలు పాడై ఇద్దరు మృతి, పలువురికి అస్వస్థత.. కల్తీ పాలే కారణమా?

Adulterated Milk in Rajahmundry | రాజ‌మండ్రిలోని లాలాచెరువు ప్రాంతంలో ఒకేసారి పలువురు తీవ్ర అనారోగ్యంతో ఆసుప‌త్రి పాల‌వ్వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. బాధితుల‌కు కిడ్నీలు పాడైన‌ట్లు తెలుస్తోంది.

రాజ‌మండ్రిలోని లాలాచెరువు ప్రాంతంలో ఒకేసారి పలువురు తీవ్ర అనారోగ్యంతో ఆసుప‌త్రి పాల‌వ్వ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.. బాధితుల‌కు కిడ్నీలు పాడైన‌ట్లు తెలుస్తోంది.. దీనంత‌ట‌కి క‌ల్తీపాలే కార‌ణ‌మ‌న్న అనుమానాలు బాధితులు వ్య‌క్తం చేస్తున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లా కేంద్రం అయిన రాజ‌మహేంద్ర‌వ‌రంలో ఒకేసారి అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు.

రాజాన‌గ‌రం మండ‌లం లాలా చెరువు ప్రాంతంలో బాధితులు ఎక్క‌వగా ఉండ‌గా వారిలో చాలా మంది ఇప్ప‌టికే అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.. ఈ విష‌యం ఆదివారం వెలుగులోకి రావ‌డంతో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తం అయ్యింది.. తూర్పుగోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్ కీర్తి చేకూరి ఆదేశాల మేర‌కు వైద్య ఆరోగ్య‌శాఖ‌, న‌గ‌ర‌పాలక అధికార‌ యంత్రాంగం దీనిపై చ‌ర్య‌లు చేప‌ట్టింది.. స్థానిక అధికారులు బాధితుల నుంచి వివ‌రాలు సేక‌రించి  చాలా మంది అన‌రోగ్యం పాల‌వ్వ‌డం వెనుక కార‌ణాల‌పై విచార‌ణ చేప‌ట్టారు.. స్థానిక చౌడేశ్వర నగర్,  దివాన్ చెరువు లోని స్వరూప్ నగర్ లో బాధితులు అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వారిలో కొందరికి కిడ్నీలు పాడైనట్లు తెలుస్తోంది. 


Adulterated Milk: రాజమండ్రిలో కిడ్నీలు పాడై ఇద్దరు మృతి, పలువురికి అస్వస్థత.. కల్తీ పాలే కారణమా?

చికిత్స పొందుతున్న వారిలో ఇద్ద‌రు మృతి..?

రాజ‌మండ్రి లోని లాలాచెరువు ప్రాంతంలో ఒకేసారి 14 మందికి పైగా అనారోగ్యం పాల‌వ్వ‌గా వారిలో కొంద‌రు ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చేరిన‌ట్లు తెలుస్తోంది.. వీరంతా కిడ్నీ సంబందిత స‌మ‌స్య‌తోనే స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్లు ఆ ఆసుప‌త్రి వైద్యులు ర‌క్త ప‌రీక్ష‌ల ద్వారా నిర్ధారించి చికిత్స అందిస్తున్న‌ట్లు స‌మాచారం.. ఇదిలా ఉంటే క‌డ్నీ సంబంధిత స‌మ‌స్య‌తోనే రెండు రోజుల క్రితం బాసెట్టి క‌న‌క‌దుర్గ (76) మృతి చెందింద‌ని కుటుంబికులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇదే స‌మ‌స్య‌తో మ‌రో వృద్ధురాలు తాడి కృష్ణవేణి మృతిచెందింద‌ని తెలుస్తోండ‌గా ఈమె కాకినాడ‌లోని ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెండంతో ఒక్క‌సారిగా స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది.


Adulterated Milk: రాజమండ్రిలో కిడ్నీలు పాడై ఇద్దరు మృతి, పలువురికి అస్వస్థత.. కల్తీ పాలే కారణమా? 

క‌ల్తీపాలే కార‌ణ‌మా...

లాలాచెరువు స‌మీప ప్రాంతాల్లో ప‌లువురు అనారోగ్యానికి గురికావడంపై అధికారులు వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు, సిబ్బంది ఇంటింటా స‌ర్వే చేపట్టారు.. అయితే దీనిపై బాధిత కుటుంబికులు వారు రోజూ పోయించుకునే పాలుపై అనుమానం వ్య‌క్తం చేశారు. కోరుకొండ ప్రాంతం నుంచి గ‌ణేష్ అనే వ్య‌క్తి ప్ర‌తీరోజూ మోటారు సైకిల్‌పై పాలు తెచ్చి అమ్ముతాడ‌ని, గ‌త సోమ‌వారం నుంచి ఈ పాలు తాగిన వారిలో ఎక్క‌వ మంది వృద్ధులు తీవ్ర అనారోగ్యం పాల‌య్యార‌ని స్థానికులు చెబుతున్నారు. ఈ పాలు తాగిన వారిలో కొంత మందికి అక‌స్మాత్తుగా కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఆసుప‌త్రి పాల‌య్యార‌ని వారిలో ఇద్ద‌రు మృతిచెందార‌ని వారి కుటుంబికులు తెలిపారు. 

పాలు అమ్మిన వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

రాజమహేంద్రవరంలోని లాలాచెరువు, చౌడేశ్వరినగర్‌, స్వ‌రూప న‌గ‌ర్ ప్రాంతంలో అక‌స్మాత్తుగా అనారోగ్యంపాల‌వ్వ‌డం వెనుక కల్తీ పాలే కార‌ణ‌మ‌ని ప్రాధ‌మికంగా బాధితుల ద్వారా వివ‌రాలు సేక‌రించిన అధికారులు ఆదిశ‌గా విచార‌ణ చేపట్టారు.. ఇద్ద‌రు మృతికి, అనేక మంది అనారోగ్యం పాల‌వ్వ‌డం కు కార‌ణంగా భావిస్తున్న పాలు శాంపిల్స్‌ను సేక‌రించి ల్యాబ్‌కు పంపించారు.. ప్ర‌స్తుతం క‌ల్తీ పాలుపై ద‌ర్యాప్తు జ‌రుగుతుండ‌గా కోరుకొండ మండ‌లానికి చెందిన గ‌ణేష్ అనే పాల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Pawan Kalyan: పరిపాలనలో పవన్ కళ్యాణ్ మార్క్.. తన శాఖల్లో పనులపై బుక్‌లెట్ - కుప్పానికి ఎంత కేటాయించారంటే..
పరిపాలనలో పవన్ కళ్యాణ్ మార్క్.. తన శాఖల్లో పనులపై బుక్‌లెట్ - కుప్పానికి ఎంత కేటాయించారంటే..
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
T20 World Cup Winner: అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Alcohol Banned Countries : ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
Embed widget