అన్వేషించండి

Elnino Effect: ఏపీ, తెలంగాణపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఓవైపు వర్షాలు, మరోవైపు ఉక్కపోత, వడగాలులతో అలర్ట్

AP Rains | ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తెలంగాణలో జూన్ 19 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రభుత్వం అప్రమత్తమైంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తం, అధికారులకు ఆదేశాలు.
  • నైరుతి రుతుపవనాలు విస్తరిస్తూ, జూన్ 19 నుండి భారీ వర్షాలు.
  • కొన్ని జిల్లాల్లో వడగాల్పులున్నాయి; ఏపీలోనూ పిడుగులతో వర్షాలు.

Telangana Rains | హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే, వాటి ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టాలని తెలంగాణ రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు రెవెన్యూ, విపత్తుల నిర్వహణ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో సాయంత్రం తరువాత ఒకట్రెండు చోట్ల వర్షం పడే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఎల్ నినో ప్రభావంతో జూన్ 15 దాటినా కూడా ఏపీ, తెలంగాణలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఏసీలు, కూలర్లు వాడుతుండటమే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

నేడు సాధారణ వర్షాలు.. 19 నుంచి వారం రోజులు భారీ వర్షాలు
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరిస్తున్నాయి. బుధవారం, గురువారాల్లో ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.  జూన్ 19వ తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, వారం రోజులపాటు ఈ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. జూన్ 1 నుంచి జూన్ 15 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 54.9 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 10 శాతం లోటుతో 49.2 మి.మీ నమోదైందని తెలిపారు. భారీ వర్షాల హెచ్చరికలతో అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు. వరద ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.

Also Read: SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!

ఓవైపు వర్షాలు.. మరోవైపు వడగాల్పులు
రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు భారీ వర్షాల హెచ్చరికలు ఉన్నప్పటికీ సోమవారం నాడు ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచాయి. ఈ జిల్లాల్లో సాధారణం కంటే 4.6 డిగ్రీల వరకు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, మహబూబ్‌నగర్‌ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే 3 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. నేడు (జూన్ 16న) కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల వడగాలులు వీచనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, నిన్న గరిష్టంగా వికారాబాద్‌ జిల్లా రాపోలులో 4.4 సెం.మీ. వర్షపాతం నమోదయింది.

ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. కొన్నిచోట్ల తీవ్రమైన ఎండలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం వేగంగా మారుతోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 

ఇక కోస్తాంధ్రలోని మిగిలిన జిల్లాలతో పాటు రాయలసీమ పరిధిలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో పిడుగులు పడే తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతకుముందు సోమవారం నాడు కూడా ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.

మరోవైపు రాష్ట్రంలో ఎండల ప్రభావం కూడా గట్టిగానే ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అనవసరంగా బయటకు రాకూడదని, ఒకవేళ అత్యవసర పనులపై బయటకు వెళ్లాల్సి వస్తే చెవుల్లోకి నేరుగా వేడిగాలి వెళ్లకుండా తలకు గుడ్డ కట్టుకోవడం లేదా టోపీలు ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Frequently Asked Questions

తెలంగాణలో భారీ వర్షాలు ఎప్పటి నుండి కురిసే అవకాశం ఉంది?

తెలంగాణలో జూన్ 19 నుండి వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరిస్తున్నాయి.

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?

ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. వరద ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించాలని సూచించింది.

తెలంగాణలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి?

రాష్ట్రంలో ఒకవైపు భారీ వర్షాల హెచ్చరికలు ఉండగా, మరోవైపు ఆదిలాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో వడగాలులు వీచాయి. నేడు (జూన్ 16న) కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు, ఎండ తీవ్రత రెండూ ఉండే అవకాశం ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా, వెళ్లాల్సి వస్తే తలకు గుడ్డ లేదా టోపీ ధరించాలని సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RS 20000 Subsidy For BCs: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
Breaking News: తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Chandra Babu On Ravan: రావణ్ లాంటి వ్యక్తులకు గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోంది! బనగానపల్లెలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
రావణ్ లాంటి వ్యక్తులకు గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోంది! బనగానపల్లెలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget