సంక్రాంతి పండుగను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రజలకు కొన్ని సీరియస్ సూచనలు చేసింది. రైల్వే స్టేషన్లలో కానీ, గూడ్స్ షెడ్స్ దగ్గర గానీ, రైల్వే సిబ్బంది నివసించే సివిల్ ప్రాంతాలు, క్వార్టర్ల సమీపంలో గానీ గాలిపటాలు ఎగుర వేయకూడదని హెచ్చరిక జారీ చేసింది. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కొన్నిచోట్ల ఇలా రైల్వే కరెంటు తీగలపై గాలిపటాలు ఎగరవేయడం వాటి దారాలు తీగలపై పడినప్పుడు ప్రజలు ప్రాణాంతకమైన షాక్ కు గురైన సంఘటన లు నమోదయ్యాయని కాబట్టి ఈసారి ఎవరు అలాంటి పనులు చేయొద్దని ఒక ప్రకటన విడుదల చేసింది.
ఏకంగా 25 కే.వి పవర్ సరఫరా అయ్యే రైల్వే కరెంట్ తీగలపై గాలిపటాలు వాటి దారాలు పడినప్పుడు ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పండుగను ప్రశాంతంగా ఇంటిదగ్గర ఎంజాయ్ చేయాలని ఎటువంటి అజాగ్రత్తగా ఉండే పనులు చేయొద్దని రైల్వే ప్రజలను కోరింది.
వికారాబాద్, చర్లపల్లి, వైజాగ్ మధ్య మరికొన్ని స్పెషల్ ట్రైన్స్
ఇప్పటికే సంక్రాంతి రద్దీ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని స్పెషల్ ట్రైన్ లను అనౌన్స్ చేసింది
08511- విశాఖపట్నం - చర్లపల్లి
ఈ ట్రైన్ జనవరి 10,12,17,19 తేదీల్లో వైజాగ్ నుండి సాయంత్రం 05:30కి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 08:15కి చర్లపల్లి చేరుకుంటుంది. దారిలో దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట,అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ,గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్ల లో ఆగుతుంది.
08512 - చర్లపల్లి- విశాఖపట్నం
ఈ ట్రైన్ జనవరి 11,13,18,20 తేదీల్లో చర్లపల్లి లో మధ్యాహ్నం 03:30కి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 07గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. దారిలో నల్గొండ, మిర్యాలగూడ,గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్ల లో ఆగుతుంది.
07416- అనకాపల్లి- వికారాబాద్
ఈ ట్రైన్ జనవరి 18న రాత్రి 09:45కి అనకాపల్లి లో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:30కి వికారాబాద్ చేరుకుంటుంది. దారిలో ఎలమంచిలి, తుని,అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, రాయనపాడు,ఖమ్మం, కాజిపేట్, వరంగల్, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి స్టేషన్ల లో ఆగుతుంది
ఈ రైళ్లు అన్నింటి లో 2Ac, 3Ac, స్లీపర్, జనరల్ క్లాస్ లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.