Pulivendula and Vontimitta ZPTC by elections: ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పులివెందుల, ఒంటి మిట్ట జడ్పీటీసీ స్థానాల్లో ఉపఎన్నికలకు పోలింగ్ మంగళవారం జరగనుంది. రెండు మండలాల్లో పోలింగ్  ఉదయం  7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. సిబ్బంది పోలింగ్ కేంద్రాలుక చేరుకున్నారు.  

పులివెందులలో అన్ని పోలింగ్‌బూత్‌లలో వెబ్ కాస్టింగ్ 

పులివెందులలో పోలింగ్ బూత్‌లన్నింటినీ సున్నితమైనవిగా ప్రకటించారు. అన్ని చోట్ల  వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయస్తున్నారు. ఒంటి మిట్టలో వెబ్‌కాస్టింగ్ లేని కేంద్రాల్లో మైక్రో-ఆబ్జర్వర్స్ ను నియమించారు. APSP బాటాలియన్స్, మొబైల్ సర్వైలెన్స్ వాహనాలు, డ్రోన్స్, క్లస్టర్ ఆధారిత పోలీస్ పర్యవేక్షణతో సహా అన్ని స్థాయిల్లో భద్రతా  పటిష్టంగా చేశారు. పులివెందుల జడ్పీటీసీలో 6 గ్రామ పంచాయతీలు, సుమారు 10,601 ఓటర్లు, 15 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఉన్నాయి. పులివెందుల పట్టణం మున్సిపాలిటీగా ఉంది. అలాగే ఒంటిమిట్ట మండలంలో  13 గ్రామ పంచాయతీలు,  24,606 ఓటర్లు ఉన్నారు. పులివెందుల నుంచి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. 

పోలింగ్ బూత్‌లు మార్చాలన్న వైసీపీ పిటిషన్ తిరస్కరణ 

అంతకు ముందు పోలింగ్ బూత్‌లను వేరే చోట ఏర్పాటు చేశారంటూ హైకోర్టులో వైసీపీ వేసిన పిటిషన్ పై విచారమ జరిగింది.   ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.  పోలింగ్ బూత్‌ల మార్పులో జోక్యాన్ని ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో ఆరు పోలింగ్ బూత్‌లు మార్చాలని అవి ఓటర్లకు దూరంగా ఉన్నాయని  లేళ్ల అప్పిరెడ్డి తన పిటిషన్‌లో కోరారు. అయితే  పోలింగ్  ఏర్పాట్లు పూర్తవుతున్న సమయంలో  ఇలా మార్చడం సాధ్యం కాదని ఎస్‌ఈసీ లార్లుస్పష్టం చేశారు. దీంతో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది.       

వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జడ్పీటీసీ స్థానం               

వులివెందుల జడ్పీటీసీ.. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం. వైఎస్ కుటుంబం దశాబ్దాలుగా అక్కడి స్థానాన్ని ఏకగ్రీవంగా కేవసం చేసుకుంటూ వచ్చింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ జరిగినా పులివెందులలో ఏకపక్షంగా పోలింగ్ జరుగుతుంది.కానీ ఈ సారి టీడీపీ అధికారంలో ఉండటం..  టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తన సతీమణి లతారెడ్డిని బరిలోకి దింపడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. అధికార దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ రోజూ ఆరోపిస్తూ వస్తోంది.  రీపోలింగ్ అవసరం అయితే బుధవారం నిర్వహిస్తారు. కౌంటింగ్ గురువారం ఉంటుంది.                              

వైఎస్ కుటుంబం ఏకతాటిపై లేకపోవడం.. పులివెందుల నియోజకవర్గాన్ని జగన్ తరపున శాసించిన వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి  వివేకా హత్య కేసులో బెయిల్ షరతుల కారణంగా హైదరాబాద్‌లోనే ఉండాల్సి రావడంతో ఎన్నికల ఫలితంపై వైసీపీలో ఉత్కంఠ ఏర్పడింది.