Rajamouli comments on Hanuman:  ప్రసిద్ధ దర్శకుడు రాజమౌళి ..వారణాశి ఈవెంట్‌లో హనుమంతుడిపై తనకు నమ్మకం లేదన్నట్లుగా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు ఎవరికి వారు రాజకీయం చేసుకుంటున్నాయి. రాజమౌళి ఏ ఉద్దేశంతో అన్నారో పట్టించుకోవడం లేదు. రాజాసింగ్ లాంటి వాళ్లు రాజమౌళి సినిమాలు చూడవద్దని.. బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు.  కొన్ని హిందూ సంస్థలు రాజమౌళిపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.  

Continues below advertisement

కొంత మంది రాజకీయనాయకులు ప్రచారం వస్తుంది కదా అని ఆయనకు మద్దతు, వ్యతిరేకంగా ఎక్కువగా స్పందిస్తున్నారు. ఏపీ మాజీ ఎంపీ హర్షకుమార్.. రాజమౌళికి మద్దతు ఇస్తూ.. బీజేపీపై విమర్శలు చేస్తూ లేఖ విడుదల చేయడం వివాదాస్పదమయింది.   ఈ అంశంపై ఏపీ బీజేపీ నేత, జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్దన్ రెడ్డి ఘాటుగా స్పదించారు. 

హర్షకుమార్ కు కౌంటర్ ఇస్తూనే. ..రాజమౌళి ఈ వివాదాన్ని ముగించాలని కోరారు.  హనుమంతుడిపై నమ్మకం లేదన్నట్లుగా రాజమౌళి వ్యాఖ్యలు చేశారని సమర్థిస్తున్నారు . అదే ఆయన క్రీస్తు మీద అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే మీ స్పందన ఎలా ఉండేది? ఈ పాటికి చందాలు వసూలు చేసి కోర్టులో కేసులు, మీడియా సమావేశాలు, ర్యాలీలు చేసేవారు కాదా? అందులోకి కుల, మతాలు తీసుకు వచ్చి రాజమౌళి మీద దండయాత్ర చేసేవారు కాదా?. ఇప్పుడు మీకు ఇష్టం లేని దేవుడ్ని కించపరిచారని మీరు సపోర్టుగా వస్తున్నారు. మీరు ఇష్టపడే దేవుడ్ని కించపరిచేవాళ్లకు ఇలాగే మద్దతిస్తారా? అని ప్రశ్నించారు.  

Continues below advertisement

అదే సమయంలో రాజమౌళి ఎక్కడ పోరపాటు జరిగిందో సరిదిద్దుకునే ప్రయత్నం చేయమని సలహా ఇచ్చారు.  రాజమౌళికి దేవుళ్లపై భక్తి ఉందా లేదా అన్నది ఆయన తీసిన సినిమాను చూస్తే అర్థమైపోతుంది. ఆయన ఏ సందర్భంలో ఆ మాటలన్నారో ఆయనే వివరణ ఇచ్చి వివాదానికి ముంగింపు పలకాలన్నదే బీజేపీ అభిప్రాయం.  సినిమా వాళ్లు చిన్న మాట మాట్లాడినా ప్రచారంలో రావడం, వివాదం కావడం, కోంత మంది సమర్థింపుగా ప్రచారం కోసం ముందుకు రావటం మామూలేనని.. రాజమౌళి ప్రపంచ స్థాయి దర్శకుడు కాబట్టి ఆయన వ్యాఖ్యలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే.. రాజమౌళి వెంటనే స్పందించి వివరణ ఇస్తే సరిపోతుంది. లేకపోతే హర్షకుమార్ లాంటి వాళ్లు అవకాశంగా తీసుకుని హిందూత్వంపై దాడి చేయడానికి ఆయుధంగా చేసుకునే ప్రమాదం ఉందన్నారు. 

వారణాశి  ఫంక్షన్ తర్వాత రాజమౌళి తన పని తాను చేసుకుంటున్నారు. కానీ రాజకీయ నేతలు మాత్రం.. రాజమౌళి కేంద్రంగా రాజకీయాలు చేస్తూ.. ఆయనను లైవ్ లో ఉంచుతున్నారు.  ఓ ప్రకటన  చేసి ఈ రాజకీయానికి .. తెరదించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.