Pawan Rushikonda Tour :  జనసేన అధినేత పవన్ కల్యాణ్ రుషికొండలో ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని పరిశీలించేదుకు వెళ్లే ప్రయత్నాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నారు.  షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం  పవన్ రుషికొండకు వెళ్లాల్సి ఉంది.  రషికొండ నిషేధిత స్థలం కాదని అయినా రుషికొండకు వెళ్లకుండా చెక్ పోస్ట్ పెట్టడం పోలీసులు అడ్డుకోవడం సరికాదని జనసేన పార్టీ స్పష్టం చేసింది.  రాజ్యాంగ హక్కుతో...ప్రజలకోసం ఋషికొండ ను పర్యటనకు పవన్ వెళ్లాలని స్ట్రాంగ్ గా ముందుకెళ్తారని జనసేన ప్రకటించంది.  అడ్డుకోవడానికి మీకు ఏం హక్కు ఉందని జనసేన నేతలు ప్రశ్నించారు.  ఋషికొండ పై మాకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు.  ఒక బాధ్యత గల నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత గా కచ్చితంగా రుషికొండ కు వెళ్తారు... అడ్డుకోవలనుకుంటే...తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు.  ఋషికొండ పీపుల్స్ ల్యాండ్..ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి...ఆ అవసరం లేదన్నారు.  3 గంటలకు పవన్ కళ్యాణ్ రుషికొండకు వెళ్లి తీరతారు...పర్యటన తరువాత నిజానిజాలు బయట పెడతారని జనసేన నేతలు స్పష్టం చేశారు. 


రుషికొండకు వెల్లే అన్ని దారుల్ని మూసేసిన పోలీసులు                 


పవన్ కళ్యాణ్ రుషికొండకు వెళ్లేందుకు వీలుగా జనసేన నేతలు పోలీసులను అనుమతి కోరారు. దీనికి పోలీసులు నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రుషికొండపై సీఎం కార్యాలయం సిద్ధమవుతున్నందున అక్కడ బయటి వారిని ఎవరినీ అనుమతించడం లేదు.    పవన్ కళ్యాణ్ రుషికొండ వెళ్లేందుకు కూడా అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో జనసేన నేతలు పవన్ కళ్యాణ్ తో ఆయన బస చేసిన నోవోటెల్ హోటల్లో చర్చలు జరుపుతున్నారు.


ఎర్రమట్టి దిబ్బల వద్దకు వెళ్లేందుకూ అనుమతి నిరాకరణ                                


పవన్ కళ్యాణ్ రుషికొండ, ఎర్రమట్టి దిబ్బల్ని పర్యటించేందుకు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఇందుకు నిరాకరించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎలాగైనా రుషికొండ వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పోలీసులు అడ్డుకుంటే అప్పుడు చూద్దామనే ధోరణిలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నోవోటెల్ హోటల్ తో పాటు రుషికొండ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎవరినీ ఇక్కడకు రాకుండా అడ్డుకుంటున్నారు. నోవోటెల్ హోటల్లో జనసేన నేతలతో సమావేశం తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్ళాలని పవన్ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. 


నోవాటెల్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు                 


పవన్ రుషికొండకు వెళ్లేందుకు నోవోటెల్ హోటల్ నుంచి బయలుదేరితే అడ్డుకునేందుకు వీలుగా పోలీసులు భారీగా మోహరించారు. దీంతో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు కూడా భారీగా ఇక్కడికి చేరుకుంటున్నారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ పవన్ వైజాగ్ టూర్ సందర్భంగా ఇలాంటి ఉద్రిక్తతలే తలెత్తాయి. అప్పుడు కూడా పవన్ నోవోటెల్ హోటల్ కే పరిమితం అయ్యారు.