Perni Nani made controversial comments about killing TDP leaders: వైఎస్ఆర్‌సీపీ నేత  పేర్ని  నాని  టీడీపీ నేతల్ని చంపాలని పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన చేస్తున్న  వ్యాఖ్యలు రాజకీయ ప్రత్యర్థులపై హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.  రాజకీయ ప్రత్యర్థులను "చీకట్లో కన్ను కొట్టి చంపేయాలని" కార్యకర్తలకు సూచిస్తున్నారు. "చీకట్లో కన్ను కొట్టి చంపేయాలి .. ఉదయమే వెళ్లి ఏమీ తెలియనట్లుగా పరామర్శించాలని" సూచించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  

పేర్ని నాని గతంలో కూడా టీడీపీ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  పేర్ని నాని వ్యాఖ్యలు వైరల్ కావడంతో, టీడీపీ మద్దతుదారులు ఆయనను "నీచమైన రాజకీయాలు" చేస్తున్నారని విమర్శించారు. వివేకానందరెడ్డిని హత్య చేసినట్లే అందర్నీ చంపాలని సలహాలిస్తున్నారని టీడీపీ మండిపడింది.  

టిడిపి కార్యకర్తలకు, వైసీపీ కార్యకర్తల మధ్య కొట్టుకు చచ్చేంత వైరం  ఎందుకని.. వాళ్ల మధ్య ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.  

హింసకు ప్రేరేపిస్తున్న పేర్ని నాని అరెస్టు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రిగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని పెంచే విధంగా కాకుండా.. హింసకు ప్రేరేపించేవిధంగా మాట్లాడటం దారుణమన్నారు.  

వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా అలజడి రేపేలా, కార్యకర్తల్ని రెచ్చగొట్టి.. టీడీపీ నేతల్ని  హత్య చేయించేలా ప్లాన్ చేస్తున్నారని... తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలను లేకుండా చేయాలని చూస్తున్నారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.