Pawan Kalyan suddenly leaves cabinet meeting: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు కానీ ఎక్కువ సేపు ఉండలేదు. ఆయన అనారగ్యంతో ఉండటంతో..కేబినెట్ భేటీకి హాజరై వెంటనే వెళ్లిపోయారు. పవన్ కల్యాణ్ ఇటీవల అరకు  పర్యటనలో ఉన్నప్పుడే సింగపూర్ తన కుమారుడికి అగ్నిప్రమాదం గురించి  తెలిసింది. మానసికంగా ఒత్తిడికి గురైన పవన్ కల్యాణ్.. కుమారుడ్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చారు. కానీ ఆయన అలసటకు గురయ్యారు. ఈ కారణంగా ఆయన సతీమణి అన్నా లెజ్ నోవా ఒక్కరే తిరుపతికి వెళ్లి మొక్కులు సమర్పించుకున్నారు. కేబినెట్  భేటీ కోసం ఆయన అమరావతికి వచ్చినప్పటికీ.. ఆరోగ్యం సహకరించలేదు. కేబినెట్ సమావేశానికి హాజరై...కూర్చోలేని పరిస్థితి ఉండటంతో విషయం చెప్పి వెళ్లిపోయారు. 

కేబినెట్ భేటీ ఫోటోల్లో కనిపించని పవన్ కల్యాణ్‌                    

కేబినెట్ సమావేశం గురించి ప్రభుత్వ సమాచార మంత్రిత్వ  ఫోటోలు రిలీజ్ చేసింది  ఈ ఫోటోల్లో పవన్ కల్యాణ్ కుర్చీ ఖాళీగా ఉంది. దీంతో అందరూ పవన్ కల్యాణ్ కేబినెట్ సమావేశానికి రాలేదా అని ఆరా తీయడం ప్రారంభించారు. అయితే అధికార వర్గాలు మాత్రం పవన్ కేబినెట్ సమావేశానికి వచ్చారని కానీ  అనారోగ్యం కారణంగా ఉండలేకపోవడంతో వెళ్లిపోయారని క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ గతంలోనూ అనారోగ్యం కారణంతో ఒకటి, రెండు సార్లు కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. అనారోగ్యం కారణంగా చికిత్స తీసుకుంటూ ఉండిపోయారు.        

కుమారుడికి ప్రమాదం కారణంగా మానసికంగా అలసిపోయిన పవన్                       

కుమారుడి ప్రమాదం కారణంగా పవన్ కల్యాణ్  మానసికంగా అలసిపోయారని.. ఇప్పుడు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేంత పరిస్థితుల్లో లేరని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండు, మూడు రోజుల విశ్రాంతి తర్వాత ఆయన మళ్లీ అధికారిక సమీక్షలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. పవన్ డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన తర్వాత ఆరు నెలల పాటు అవిశ్రాంతంగా పని చేశారు.  అయనకు ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలు, నడుం నొప్పి వంటి వాటికి చికిత్స నిర్లక్ష్యం చేయడంతో సమస్యలు పెరిగిపోయినట్లుగా తెలుస్తోంది.            

నడుం నొప్పి తిరగబెట్టడంతో విశ్రాంతికి ప్రాధాన్యం                              

ప్రస్తుతం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ హైదరాబాద్ లో ఉన్నారు. సింగపూర్ లో  బ్రాంకోస్కోప్ చికిత్స చేయడంతో.. ఇక్కడ ఫాలో అప్ ట్రీట్మెంట్ చేయించాల్సి ఉంది. ఉపిరి తిత్తుల్లోకి పోగ పోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వాటిని తగ్గించాలంటే.. ముందస్తుగా ఇప్పుడు చికిత్స కీలకం. పవన్ కల్యాణ్ మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి చూసుకుంటున్నారు.