Pawan Kalyan: కొణిదెల గ్రామ రూపురేఖలు మారుస్తున్న పవన్ కల్యాణ్ - ఇలా అడిగారు.. అలా చేస్తున్నారు!
Konidela village:నంద్యాల జిల్లా కొణిెదెల గ్రామ రూపురేఖల్ని పవన్ కల్యాణ్ మారుస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వారి సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారు.

Pawan Kalyan changing look of Konidela village: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడి, ఒక పల్లె ముఖచిత్రాన్ని ఎలా మార్చవచ్చో కొణిదెల గ్రామ అభివృద్ధి ద్వారా నిరూపించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని ఈ గ్రామంపై ఆయన చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధతో ఇప్పుడు కొణిదెల అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. కేవలం రాజకీయ హామీలకే పరిమితం కాకుండా, తన ఇంటి పేరుతో ఉన్న ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని, అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ .
గ్రామస్తుల ప్రధాన సమస్య అయిన తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధుల నుంచి రూ. 50 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ నిధులతో యుద్ధ ప్రాతిపదికన నిర్మించిన 90,000 లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్, వేసవి కాలానికి ముందే అందుబాటులోకి రావడం విశేషం. సుమారు 2 వేల మంది గ్రామస్తుల దాహార్తిని తీరుస్తూ, వారి కళ్లలో ఆనందం నింపిన ఈ ప్రాజెక్ట్ ఒక నాయకుడి బాధ్యతాయుత ప్రవర్తనకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోందని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు.
వ్యక్తిగత విరాళంతోనే ఆగకుండా, ప్రభుత్వ పథకాలైన పల్లె పండగ 1.0, 2.0 , గ్రామీణ రహదారి అభివృద్ధి సబ్ ప్లాన్ ద్వారా సుమారు రూ. 6 కోట్లకు పైగా నిధులను కొణిదెల గ్రామానికి మంజూరు చేయించడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. దీని ఫలితంగా గ్రామంలో 5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయిన్లు, రైతుల కోసం ఫీడర్ ఛానల్స్ , చెక్ డ్యామ్స్ మరమ్మతులు పూర్తయ్యాయి. రోడ్ల నిర్మాణం నుంచి గోకులాల ఏర్పాటు వరకు గ్రామంలో సర్వతోముఖాభివృద్ధి కనిపిస్తోంది.
శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో కొణిదెల గ్రామానికి మహర్దశ
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) February 21, 2026
•రూ. 50 లక్షల విరాళంతో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం
• తీరనున్న కొణిదెల గ్రామ దాహార్తి
•పల్లె పండగ, సాస్కీ, గ్రామీణ రహదారి సబ్ ప్లాన్ ద్వారా రూ. 6 కోట్లతో పలు అభివృద్ధి పనులు
•ఎన్నికల ముందు కొణిదెల గ్రామాన్ని దత్తత… pic.twitter.com/1Xt8cEHsEM
అధికారం కోసం ఇచ్చిన మాటను ఎన్నికల తర్వాత కూడా గుర్తుపెట్టుకుని, ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఇలా మహర్దశ పట్టించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా యంత్రాంగాన్ని, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను సమన్వయం చేస్తూ పనులను సకాలంలో పూర్తి చేయించడం పవన్ కళ్యాణ్ పాలనా దక్షతకు నిదర్శనంగా ప్రశంసిస్తున్నారు. ఒక గ్రామం అభివృద్ధి చెందితే ఆ మార్పు యావత్ రాష్ట్రానికే స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కొణిదెల గ్రామాభివృద్ధి ద్వారా ఆయన చాటిచెప్పారంటున్నారు.























