Pawan Kalyan :  తనను అరెస్ట్ చేసుకోవచ్చని..చిత్రవధ చేసుకోవచ్చని  జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వానికి సవాల్ చేశారు. వైసీపీ కి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ జనసేన పార్టీలో చేరిన సందర్భంగా మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వాలంటీర్లపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో కేసులు పెట్టారు... పవన్ ను విచారించాలని జీవో ఇచ్చారని..  . అరెస్ట్ చేసే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఇలాంటి కేసులకు భయపడితే తాను పార్టీ ఎందుకు పెడతాననిప్రకటించారు. తనను ప్రాసిక్యూషన్ చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని.. చేసుకోవచ్చని  స్పష్టం చేశారు. జగన్  సై అంటే తాను సై అన్నారు. 


డేటా చౌర్యంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్తా : పవన్ కల్యాణ్ 


వాలంటీర్లకు అధిపతి ఎవరని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వాలంటీర్లు  సేకరిస్తున్న డౌట్ మెత్తం  ప్రైవేటు సంస్థ అయిన ఎఫ్. వో. ఏకు వెళ్తుందని.. ఏ జీవో కింద దీన్నిప్రైవేటుపరం చేశారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. నేను మాట అన్నానంటే..  అన్నింటికీ సిద్ధపడే అంటానని స్పష్టం చేశారు. వాలంటీర్లు సేకరించే సమాచారం అంతా డేటా ప్రొటెక్షన్ కిందకు  వస్తుందన్నారు. అలాంటి డేటా నానక్ రామ్ గూడలోని ఎఫ్‌వోఏ సంస్థకు వెళ్తోందన్నారు. తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడానని.. తప్పు చేసిన వాళ్లు శిక్షకు గురవక తప్పదన్నారు. వాలంటీర్లు ఓ ఎనిమిదేళ్ల పాపను రేప్ చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు. ఓ వాలంటర్ తన ఇల్లు రోడ్ వైడెనింగ్‌లో అన్యాయంగా కూల్చేశారని..తనను కలిసిందని.. తర్వాత నెలకే ఆమె అన్నయ్య అనుమానాస్పదంగా చనిపోయారన్నారు. ఈ  కారణంగానే జనవాణిని ప్రారంభించామని పవన్ కల్యాణ్ తెలిపారు.  


మర్డర్లు చేసిన వారిని ప్రాసిక్యూషన్ చేయరా : పవన్ 


తనను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇచ్చారని.. మర్డర్లు చేసిన వారికి ప్రాసిక్యూషన్ ఉండదా అని ప్రశ్నించారు. పొరపాటున అత్యాచారాలు జరుగుతాయన్నారు.. వారిని ప్రాసిక్యూట్ చేయరా అని ప్రశ్నించారు.  వాలంటీర్లు సేకరించే సమాచారాన్ని ఏ జీవో కింద ప్రైవేటు పరం చేశారు..దానిపై విచారణ జరగాల్సిందేనని పవన్ కల్యాణ్  డిమాండ్ చేశారు. డేటా చౌర్యం అత్యంత తీవ్రమైన నేరమని.. దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు. జగన్‌కు తన మన అనే బేధాలేవీ లేవని..ఆయనను ఇంటికి పంపాలని.. కుదిరితే చర్లపల్లి జైలుకు పంపాలన్నారు. ప్రజలు బాగుండాలంటే పరిపాలన బాగుండాలన్నారు.  గతంలో కూడా అవినతి ఉంది కానీ .. కొండలు దోచేంత అవినీతి లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 


రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేనది కీలక పాత్ర : పవన్ 


తాను  కోరుకుంటే ముఖ్యమంత్రిని కాలేనని ప్రజలు కోరుకుంటేనే ముఖ్యమంత్రి అవుతానన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేనది కీలకమైన  పాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. పంచకర్ల రమేష్ బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పంచకర్లకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.