Pawan is not responding to Chandrababu phone calls Why: ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పని చేసినా.. పని చేయకపోయినా.. కనిపించినా కనిపించకపోయినా హాట్ టాపిక్ అవుతున్నారు. కొద్ది రోజుల కిందట కలెక్టర్ల సమావేశానికి వెళ్లి రెండు రోజుల పాటు యాక్టివ్గ్ గా పాల్గొన్న ఆయన మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి మాత్రం హాజరు కాలేదు.అంతకు ముందుకేబినెట్ భేటీకి కూడా హాజరు కాలేదు. నాదెండ్ల మనోహర్ తో చంద్రబాబు మాట్లాడినప్పుడు తాను పవన్ తో మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ అందుబాటులోకి రాలేదని చెప్పారు. ఈ విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తీవ్రమైన నడుం నొప్పి అని చెప్పిన పవన్ ఆలయాల పర్యటనకు వెళ్లడంతో మరింతగా ఈ చర్చ జోరందుకుంది.
మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి డుమ్మా కొట్టిన పవన్
పవన్ కల్యాణ్ అధికారిక కార్యక్రమాల్లో కనిపించక దాదాపుగా నెల రోజులు అయింది. అయితే పార్టీ కార్యకరమాల్లోనూ కనిపించలేదు. వ్యక్తిగత పర్యటన కోసం సింగపూర్ వెళ్లివచ్చిన తర్వాత ఆయనకు అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితయ్యారు. దక్షిణాది ఆలయాల పర్యటనకు వెళ్లాలనుకున్నారు కానీ జ్వరం కారణంగా వాయిదా వేసుకున్నారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు పర్యటన చేపట్టారు. అధికార విధులకూ హాజరు కాకపోవడంతో కూటమిలో ఏదో జరిగిందన్న ప్రచారం ఊపందుకుంది. వైసీపీ వర్గాలు, ఆ పార్టీ సోషల్ మీడియా ఈ ప్రచారాన్ని చేస్తున్నాయి.
చంద్రబాబు ఫోన్లకు పవన్ అందుబాటులోకి రాలేదని ప్రచారం
అయితే జనసేన వర్గాలు మాత్రం పవ న్ కల్యాణ్ చంద్రబాబుకు అందుబాటులోకి రాకపోవడం అనేది ఏమీ లేదని.. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తీరిక లేని షెడ్యూల్ వల్ల స్వల్ప అస్వస్థతకు గురైన కారణంగా విశ్రాంతి తీసుకున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ఏమీ లేదని.. కూటమిలో సుహృద్భావ సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయని చెబుతున్నారు. పవన్ జిల్లాల పర్యటన ప్రారంభిచాలనుకుంటున్నారు. అందులో భాగంా ముందస్తుగా కుటుంబంతో కొద్ది రోజులు గడిపి వచ్చారని.. ఆలయాల సందర్శన కూడా పూర్తి చేస్తున్నారని చెబుతున్నారు.
అగస్త్య ఆశ్రమంలో ఆయుర్వేద వైద్యంపై ఆరా
పవన్ కు నడుం నొప్పి చాలా కాలంగా ఉంది. రాజకీయ ప్రచారం చేస్తున్నప్పుడు కూడా నడుంనొప్పతో ఇబ్బంది పడ్డారు. కేరళ అగస్త్య ఆశ్రమానికి వెళ్లినప్పుడు అక్కడి వారిని కూడా స్పాండిలైటిస్ సమసస్యకు .. ఆయుర్వేద చికిత్స గురించి వాకబు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ సమస్య కారణంగా పవన్ చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నందున కేరళ వైద్యం చేయించుకునే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. కూటమి మధ్య అపోహలు వస్తాయని ఆశపడే వారికి పవన్ కల్యాణ్ సరైన సమయంలో షాక్ ఇస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.