27 IPS officers transfer: ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థలో భారీగా మార్పులు చేస్తూ డీజీపీ నిర్ణయం తీసుకున్నరాు. ఇరవై ఏడు మంది సీనియర్ అధికారుల్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి ఎస్పీగా ఉన్న సుబ్బారాయుడ్ని ఇటీవల బదిలీ చేశారు. ఆయనకు పోస్టింగ్ ఈ బదిలీల్లో ఇచ్చారు. ఎర్రచందనం టార్స్ ఫోర్స్ ఎస్పీగా అవకాశం కల్పించారు. తొక్కిసలాట ఘటన కారణంగా ఆయనపై బదిలీ వేటు వేశారు. తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజుకు అవకాశం కల్పించారు. కాకినాడ ఎస్పీగా బిందుమాధవ్‌ను బదిలీ చేశారు.
పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు డైరక్టర్‌గా ఆర్కే మీనాను నియమించారు. ఏసీబీ డైరక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రాజ్యలక్ష్మిని నియమించారు. కర్నూలు ఎస్పీగా విక్రాంత్ పాటిల్‌కు అవకాశం కల్పించారు. గ్రే హౌండ్స్ డీజీగా బాబ్జీకి అవకాశం ఇచ్చారు. శాంతిభద్రతల అదనపు డీజీగా మధుసూదన్ రెడ్డిని నియమించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరక్టర్‌గా పాలరాజును నియమించారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై పలు కేసులు పెట్టడంలో పాల్ రాజు కీలకంగా వ్యవహరించినట్లుగా టీడీపీ నేతలు ఆరోపణలు చేసేవారు. అయితే ఆయనకు ఇప్పుడు పోస్టింగ్ లభించింది.
ఎపీఎస్పీ కర్నూలు కమాండెంట్‌గా దీపికకు అవకాశం కల్పించారు. విశాఖపట్నం డీసీపీగా కృష్ణకాంత పాటిల్, అల్లూరు సీతారామరాజు జిల్లా ఆపరేషన్స్ అదనపు ఎస్పీగా జగదీష్, కడప ఎస్పీగా అశోక్ కుమార్, ఇంటలిజెన్స్ ఎస్పీగా రమాదేవిని నియమించారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణలు ఎదుర్కొన్న హర్షవర్ధన్ రెడ్డికి కూడా పోస్టింగ్ ఇచ్చారు. సీఐడీ ఎన్‌సీఆర్‌బీ ఎస్పీగా అవకాశం కల్పించారు. ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీగా రాజకుమారిని నియమించారు.
వైసీపీ హయాంలో వ్యవహరించిన తీరుపై విమర్శలు ఎదుర్కొని పోస్టింగులు లేకుండా ఉన్న పలువురికి అవకాశం కల్పించారు. డీఐజీ సత్య యేసుబాబుకు పీటీవోలో డీఐజీగా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న మరో ఐపీఎస్ అధికారి అన్బురాజన్ ను డీఐజీగా స్పోర్ట్స్ , వేల్ఫేర్ విభాగంలో నియమించారు. పోస్టింగ్ లేని డీఐజీ అట్టాడ బాబూజీ గ్రే హౌండ్ డీఐజీగా, ఫక్కీరప్పను ఎపీఎస్పీ డీఐజీగా బదిలీ చేశారు.
హ్యామన్ రైట్స్ అండ్ లీగల్ కోఆర్డినేషన్ ఎస్పీగా సుబ్బారెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. ఎస్ శ్రీధర్ ను సీఐడీఎస్పీగా నియమించారు. కనుబుల్లి ధీరజ్ ను అడిషనల్ ఎస్పీగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు పంపించారు. ఇటీవల ఐపీఎస్ హోదా పొందిన వారికి కూడా పోస్టింగులు ఇచ్చారు. గత వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు చెప్పినట్లుగా చేసి టీడీపీ నేతల్ని వేధించారని ఆరోపణలు ఎదుర్కొన్న చాలా మందికి పోస్టింగులు దక్కాయి. కానీ కేసుల్లో ఇరుక్కున్న సీనియర్ అధికారులుక మాత్రం పోస్టింగులు దక్కలేదు. త్వరలో కొంత మందిపై కేులు నమోదుయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
సుదీర్ఘ కాలం పోస్టింగ్ లు లేకపోతే వారి సర్వీసులో సమస్యలు వస్తాయన్న కారణంగా వారి కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని వైసీపీ విధేయులు అనే ముద్ర ఉన్నప్పటికీ పోస్టింగులు ఇచ్చారని అయితే అప్రాధాన్య పోస్టింగులు ఇచ్చారని భావిస్తున్నారు.