NTR District News: ఎన్టీఆర్ జిల్లాలో రాత్రి వేళ భీభత్సం రేగింది. వాత్సవాయి మండలంలో (Vatsavai Mandal) మక్కపేట (Makkapeta) సమీపంలో నడి రోడ్డుపైన కొంత మంది గొడవ పడ్డారు. అందులో ఓ వ్యక్తిపై ఒంటిపై నూలు పోగు కూడా లేకపోవడం గమనార్హం. అతను కొందరు వ్యక్తులతో గోడవ పెట్టుకుంటుండడం చూసి దారిన పోయేవారు చూస్తూ వెళ్లారు. కొందరు అక్కడ ఆగి ఆ చీకట్లో అతని బట్టలు తెచ్చి ఇచ్చి వెళ్లిపోయారు.


స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా (NTR District News) వాత్సవాయి మండలం (Vatsavai Mandal)లో మక్కపేటకు చెందిన ఓ వ్యక్తి ఆ దగ్గరి గ్రామానికి చెందిన పరాయి మహిళతో ఏకాంతంగా గడుపుతున్నాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడి చేశారు. వారు ఇద్దరూ ద్విచక్రవాహనంపై మక్కపేట గ్రామ సమీపంలోని ఎన్‌ఎస్పీ కాల్వ (NSP Canal) వద్ద కారు చీకట్లో పొలంలోకి వెళ్లి ఏకాంతంగా గడుపుతున్నారు. ఆ జంటను గమనించిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అటుగా వెళుతుండగా ఆ జంటను గమనించారు. కొంతసేపటి తర్వాత ఆ వ్యక్తులు పంట పొలంలోకి వెళ్లి ఇద్దరు యువకులు ఆ వ్యక్తిపై దాడి (Attack on Couple) చేశారు.


అతను వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఒంటిపై దుస్తులు (నగ్నంగా) లేకుండా రక్షించండి అంటూ కేకలు వేస్తూ రోడ్డు పైకి పరుగులు తీశాడు. దారిలో వెళ్తున్న కొందరు వాహనదారులు ఆపి ఆరా తీశారు. దీంతో ఎవరో ఇద్దరు యువకులు తనపై దాడి చేశారని బాధితుడు వారికి చెప్పాడు. రోడ్డు పై నుంచి ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తి దుస్తులు సెల్ ఫోన్ టార్చ్ లైట్ సహాయంతో వెతికి యువకులు బాధితుడి దుస్తులు ఇచ్చి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటికి వచ్చాయి.


బట్టలు వేసుకోకుండా దురుసుతనం


అయితే, ఆ వీడియోల్లో మాత్రం ఓ వ్యక్తిని బాధితుడు ‘నువ్వే నన్ను కొట్టావు.. ఎందుకు కొట్టావో చెప్పు’ అంటూ ఆవేదనతో ప్రశ్నిస్తున్నాడు. అయితే, ఆ వ్యక్తి ‘నిన్ను కొట్టాల్సిన అవసరం నాకేంటి, నేను టాయ్ లెట్ కోసం ఇక్కడ ఆగాను’ అంటూ బదులిచ్చాడు. లేదు నువ్వే నన్ను కొట్టావు. నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అంటూ బాధితుడు బట్టలు వేసుకోకుండా తిరుగుతూ నానా బీభత్సం చేశాడు. ముందు బట్టలు వేసుకొని మాట్లాడు అని అక్కడి వారు వారించినా వినకుండా వీరంగం చేశాడు. పోలీసుల్ని పిలిపించు మాట్లాడదాం. నన్ను ఎందుకు కొట్టావో చెప్పు అంటూ అరిచాడు. ఈ విషయం గురించి స్థానిక విలేకరులు సమీప పోలీస్ స్టేషన్‌లోని (Vatsavai Police Station) ఎస్సై అభిమన్యును సంప్రదించగా తమకు ఎటువంటి సమాచారం రాలేదని అన్నారు. అయినా దీనిపై విచారణ చేస్తామని తెలిపారు. మొత్తానికి ఈ వ్యవహారాన్ని కొందరు ఫోన్లలో రికార్డు చేయడం.. అది మొత్తం బయటకు రావడంతో స్థానికంగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయింది.