ఎన్టీటీపీఎస్‌ NTTPSలో ఘోర ప్రమాదం జరిగింది. పొట్ట కూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఈ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయారు. ఎనిమిది మందితో పైకి వెళ్తున్న లిఫ్ట్ తీగ తెగిపోవ‌డంతో ఘోరం జరిగిపోయింది. అత్యంత వేగంగా ఆ లిఫ్ట్‌ కింద‌కు జారిపోయింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో స్పాట్‌లోనే ఒక‌రు చ‌నిపోగా, మ‌రో ఇద్ద‌రు హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగిలిన ఐదుగురు క్ష‌త‌గాత్రుల‌కు హాస్పిట‌ల్ లో చికిత్స అందిస్తున్నారు. దీనిపై కొండ‌ప‌ల్లి పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. లిఫ్ట్ లో చిక్కుకున్న వారిని అంతి కష్టమ్మీద బ‌యట‌కు తీశారు. 


కార్మిక సంఘాల ఆందోళన...
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఎన్టీటీపీఎస్ లో ప్రమాదం జరిగిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రత పరమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. తక్షణమే వీటిపిఎస్, పవర్ మేక్, కంపెనీల అధికారులు బోర్డు హాస్పటల్ వద్దకు వచ్చి సమస్యను పరిష్కరించాలని  డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని  కోరుతూ తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు బోర్డు హాస్పిటల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.