New York based Princeton IT Services opens a new facility in Gudivada:   గుడివాడలో ప్రిన్స్‌టన్ ఐటీ సర్వీసెస్ కంపెనీ తన కొత్త క్యాంపస్‌ను ప్రారంభించింది. ఇది గుడివాడలో మొట్టమొదటి ఐటీ కంపెనీ కార్యాలయం.  ఇక్కడ  మొదటిగా వంద మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.   ఈ క్యాంపస్ ప్రారంభం, రాష్ట్రంలో ఐటీ సెక్టార్‌కు ఇతర ప్రాంతాల్లోకి విస్తరించడానికి మరో మైలురాయిగా నిలుస్తోంది. క్యాంపస్‌ను ఇటీవల ప్రారంభించినప్పటికీ, అక్టోబర్ 3, 4 తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసి, కొత్త ఉద్యోగులను ఎంపిక చేస్తున్నారు.

Continues below advertisement

జైన్ టెంపుల్ స్ట్రీట్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో ఈ క్యాంపస్ ఏర్పాటు చేశారు. దసరా రోజు ప్రారంభించారు.  ప్రిన్స్‌టన్ ఐటీ సర్వీసెస్, ఒరాకిల్ టెక్నాలజీ సొల్యూషన్లు, క్లౌడ్ ఆటోమేషన్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సిస్టమ్ సపోర్ట్‌లలో నిపుణులు. హైదరాబాద్, న్యూయార్క్‌లో ఇప్పటికే ఆఫీసులు ఉన్న ఈ కంపెనీ, గుడివాడలోనూ ఐటీ ఆఫీసు ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది.  

    గుడివాడ యువతకు అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం. ఇక్కడి తక్కువ ఖర్చు, ప్రతిభావంతులు మాకు ఆకర్షణ అని ప్రిన్స్‌టన్  యజమానులుచెబుతున్నారు.  గుడివాడ ఎమ్మెల్యే  వెనిగండ్ల రాము స్వయంగా ఎన్నారై. ఆయన అక్కడి ఐటీ కంపెనీలతో మాట్లాడి కార్యాలయలను ప్రారంభించేప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్యాంపస్ లో ఉద్యోగులుగా గుడివాడ వారినే  నియమించుకుంటున్నారు. 

అక్టోబర్ 3, 4 తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు  ఏర్పాటు చేశారు.  QR కోడ్ స్కాన్ చేసి careers.gudivada@princetonits.comకి మెయిల్ చేయాలి.  ఫ్రెషర్లు, ఎక్స్‌పీరియన్స్‌డ్ డెవలపర్లకు అవకాశాలు ఉన్నాయి.