వెజిటేరియన్ లో ప్లేట్ మీల్స్, ఫుల్ మీల్స్ అని ఉంటాయి కానీ.. నానె వెజ్ లో అలాంటివి ఉండవు. ఒక బిర్యానీతో ఆకలి తీరకపోతే ఇంకోటి ఆర్డర్ ఇవ్వాల్సిందే. కానీ నెల్లూరులో మాత్రం మీరు తిన్నంత బిర్యానీ పెడతామంటున్నారు. అది కూడా జస్ట్ 135 రూపాయలకు మాత్రమే. 135 రూపాయలకే అన్ లిమిటెడ్ బిర్యానీ అంటే జనాలు ఊరుకుంటారా..? ఓ పట్టుబడతామంటూ ఇలా నెల్లూరులోని అక్క - బావ రెస్టారెంట్ కి దారి తీస్తున్నారు.
అక్క బావ రెస్టారెంట్ అన్ లిమిటెడ్ బిర్యానీ
నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్ లైన్లో ఉన్న అక్క బావ రెస్టారెంట్ అన్ లిమిటెడ్ బిర్యానీతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. అయితే ఇక్కడే చిన్న టెక్నిక్ ఉపయోగించారు రెస్టారెంట్ నిర్వాహకులు. 135 రూపాయల స్టార్టప్ ప్యాకేజీలో 3 చికెన్ పీస్ లు, ఒక ఎగ్, అన్ లిమిటెడ్ బిర్యానీ రైస్ ఉంటుంది. 199 రూపాయల స్పెషల్ ప్యాకేజీలో 6 చికెన్ పీస్ లు, ఒక కోడిగుడ్డు అన్ లిమిటెడ్ బిర్యానీ రైస్ వడ్డిస్తారు. ఇక ఇక్కడ మూడో వెరైటీ కూడా ఉందండోయ్.. అదే స్టూడెంట్ ప్యాకేజీ. స్టూడెంట్ స్పెషల్ ప్యాకేజీలో 99 రూపాయలకే బిర్యానీ రైస్, 2 చికెన్ పీస్ లు ఒక కోడి గుడ్డు ఇస్తారు. ఇదీ ఈ హోటల్ స్పెషాలిటీ.
135 రూపాయలకే కోరినంత బిర్యానీ రైస్ ఇస్తున్నారు కదా అని ఆషామాషీగా తీసుకోవద్దు. బిర్యానీ టేస్ట్ ఇక్కడ సూపర్ గా ఉందంటున్నారు కస్టమర్లు. బిర్యానీకి న్యాయం చేయగలిగినవారు వస్తే మాత్రం కచ్చితంగా పైసా వసూల్ అంటున్నారు.
నెల్లూరోళ్లది వెరైటీ స్టైల్
కస్టమర్లను ఆకట్టుకోడానికి ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. అందులో నెల్లూరోళ్లది వెరైటీ స్టైల్. గతంలో ఇదే అక్క బావ రెస్టారెంట్ ప్రత్యేకంగా పానీపూరీ కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంచేది. అప్పుడు కూడా అన్ లిమిటెడ్ పానీ పూరీ పేరుతో ప్రత్యేక స్కీమ్ పెట్టారు. 50 రూపాయలకే అన్ లిమిటెడ్ పానీపూరీ అంటూ నగర వాసులకు సరికొత్త టేస్ట్ చూపించారు. ఇప్పుడు అన్ లిమిటెడ్ పానీపూరీ అంటూ మరో కొత్త స్కీమ్ తో ముందుకొచ్చారు హోటల్ నిర్వాహకులు.
ఫంక్షన్లలో కూడా బిర్యానీ విషయంలో వడ్డించేవారు కాస్త ఆచితూచి ఆలోచిస్తారు. కానీ ఈ హోటల్ మాత్రం అన్ లిమిటెడ్ అనే పేరుతో కస్టమర్లని బాగా ఆకట్టుకుంటోంది. అందులోనూ కేవలం 135 రూపాయలకే అన్ లిమిటెడ్ బిర్యానీ అనే సరికి ఓ మోస్తరుగా బిర్యానీ లాగించేవారంతా ఇక్కడికి క్యూ కడుతున్నారు. బిర్యానీ టేస్ట్ కూడా అదిరిపోతుందని అంటున్నారు కస్టమర్లు.
నెల్లూరులో నాన్ వెజ్ ఐటమ్స్ బాగా ఫేమస్. చేపలు, రొయ్యలు, చికెన్, మటన్ తో చేసే వెరైటీలతో హోటళ్లు బోజన ప్రియులను ఆహ్వానిస్తుంటాయి. ఇప్పుడిలా అన్ లిమిటెడ్ బిర్యానీ అంటే అది బోజన ప్రియులను, ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులను బాగా ఆకర్షిస్తోంది. అందుకే నెల్లూరులో ఇప్పుడీ స్కీమ్ బాగా ఫేమస్ అవుతోంది. ఒక్కసారయినా అన్ లిమిటెడ్ బిర్యానీ టేస్ట్ చూడాలని యువత ఇటువైపు దారి తీస్తోంది.