Anantapur News:  ప్రముఖ డీకార్బనైజేషన్ సొల్యూషన్స్ కంపెనీ అయిన ReNew ఎనర్జీ గ్లోబల్ పిఎల్‌సి   ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో భారతదేశంలోని అతిపెద్ద హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.22,000 కోట్లు  పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. 1.8 GWp సోలార్ పవర్ మరియు 1 GW విండ్ పవర్ తో దాదాపు 2.8 GW ఉత్పత్తి సామర్థ్యం,  2 GWh బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ (BESS)తో, ఇది భారతదేశంలో అతిపెద్ద RE కాంప్లెక్స్‌ లలో ఒకటిగా మారబోతోంది. 

 మంత్రి నారా లోకేష్ గారు ,  రిన్యూ  ఛైర్మన్  సుమంత్ సిన్హా   సమక్షంలో ఈ ప్రాజెక్టుకు పునాది రాయి వేశారు. ఈ ప్రాజెక్ట్ యొక్క మొదటి దశలో, ReNew 587 MWp సౌరశక్తి , 250 MWh పవనశక్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తుంది. దీంతో పాటు 415 MWh BESS కూడా ఏర్పాటు చేస్తున్నారు.   పెద్ద BESS ఏర్పాటు చేయడం ద్వారా  పునరుత్పాదక శక్తిని మరింత దృఢంగా  పంపిణీ చేయడానికి వీలు కల్పిస్తుంది. మేక్ ఇన్ ఇండియా మిషన్‌ స్ఫూర్తితో ఈ ప్రాజెక్ట్ రూపొందించారు.  రాజస్థాన్‌లోని జైపూర్, గుజరాత్‌లోని ధోలేరాలోని ReNew   సౌర తయారీ యూనిట్ల నుండి  మేడ్-ఇన్-ఇండియా సోలార్ ప్యానెల్‌లతో రూపొందించారు.  ఉత్పత్తిని పెంచడానికి అత్యాధునిక సోలార్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. మరోవైపు సోలార్ ప్యానెళ్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఇందుకోసం భారీ స్థాయిలో నీరు అవసరపడుతుంది. అందుకే నీటిని ఆదా చేసేందుకు నీటి రహిత రోబోటిక్ క్లీనింగ్‌ను ఉపయోగిస్తున్నారు. 

 ఆంధ్రప్రదేశ్   క్లీన్ ఎనర్జీ పాలసీకి అనుగుణంగా పెట్టుబడులు పెడుతున్నారు.   2030 నాటికి భారతదేశం   500 GW నాన్-ఫాసిల్ ఇంధన లక్ష్యానికి దోహదం చేస్తుంది. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు సాధించాలని మేం పెట్టుకున్న లక్ష్యం ఆధారంగా కార్యరూపం దాల్చిన ప్రాజెక్ట్ ఇది అని నారా లోకేష్ అన్నారు.  ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినందుకు  రెన్యూనూ అభినందించారు.  ఇది పీక్ అవర్స్ లో గ్రిడ్ సామర్థ్యాన్ని  పెంచడమే కాకుండా, క్లీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్‌ను నేషనల్ లీడర్ గా నిలబెట్టిందని పేర్కొన్నారు.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలతో ముందుకు వెళ్తోందని  రిన్యూ చైర్మన్  ఛైర్మన్  సుమంత్ సిన్హా అన్నారు.  అద్భుతమైన ట్రాన్స్‌ మిషన్ కనెక్టివిటీ, సౌర ,  పవన వనరులను సమృద్ధిగా కలిగి ఉందని సిన్హా సంతృప్తి వెలిబుచ్చారు.   2030 నాటికి 500 GW నాన్-ఫాసిల్ ఇంధన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే ప్రధానమంత్రి లక్ష్యాన్ని సాధించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  అందులో భాగంగానే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని 10 సైట్‌లలో  రిన్యూ 717 MW ఆపరేషనల్ విండ్ కెపాసిటీ మ, 60 MW సోలార్ కెపాసిటీ   పోర్ట్‌ ఫోలియోను కలిగి ఉంది. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ తో, ఇది 78.5 GW సౌర, 35 GW పవన విద్యుత్ సామర్థ్యం ,  25 GWh బ్యాటరీ శక్తి నిల్వను ఉత్పత్తి చేయాలనే రాష్ట్ర లక్ష్యానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు.