అన్వేషించండి

Nara Lokesh: 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీ - నారా లోకేష్ టార్గెట్

carrier industry : భారతదేశపు కూల్ క్యాపిటల్ గా ఏపీ అవతరించిందని నారా లోకేష్ అన్నారు. శ్రీసిటీలో క్యారియర్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు.

Nara Lokesh laid foundation stone carrier industry:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే భారతదేశపు  కూల్ క్యాపిటల్ గా అవతరించిందని మంత్రి లోకేష్ ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న ఏసీలలో గణనీయమైన భాగం ఏపీ నుంచే వస్తోందని, 2027 నాటికి దేశీయ ఏసీ ఉత్పత్తిలో 60 శాతం, 2028 నాటికి 80 శాతం వాటా ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. క్యారియర్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ రూ. 1000 కోట్ల పెట్టుబడితో ఏపీకి రావడం రాష్ట్ర ఎకోసిస్టమ్ పట్ల ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.

డేటా సెంటర్ పరికరాల తయారీలో ప్రపంచ నాయకత్వం 

కేవలం డేటా సెంటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా, వాటికి అవసరమైన కూలింగ్ సిస్టమ్స్, చిల్లర్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి పరికరాల తయారీలో ఏపీని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ వివరించారు. ఫార్మా రంగంలో భారత్ ఏవిధంగా అగ్రగామిగా ఉందో, డేటా సెంటర్ కాంపోనెంట్స్ తయారీలో కూడా అదే స్థాయి నాయకత్వాన్ని సాధించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖను గ్లోబల్ ఏఐ హబ్‌గా మార్చే ప్రక్రియలో ఇదొక కీలక అడుగు అని తెలిపారు.

 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, పెట్టుబడులు కేవలం నిధుల కోసం మాత్రమే కాకుండా యువతకు నైపుణ్యం, ఉపాధి కల్పన కోసమని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా  నైపుణ్యం పోర్టల్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు.

 డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ 

రాష్ట్రంలో ప్రస్తుతం నమో నరేంద్ర మోదీ - చంద్రబాబు నాయుడు కలయికతో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ వేగంతో పాలన సాగుతోందని మంత్రి అభివర్ణించారు.  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ ప్రభుత్వ ప్రత్యేకతని, ఒక్క జూమ్ కాల్‌తోనే ఆర్సెలార్ మిట్టల్ వంటి సంస్థలను రాష్ట్రానికి రప్పించగలిగామని గుర్తుచేశారు. పరిశ్రమలకు ఏ అవసరం వచ్చినా కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ దూరంలో ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. 

 శ్రీసిటీ  మేక్ ఇన్ ఇండియాకు రోల్ మోడల్ 

8,500 ఎకరాల్లో విస్తరించి, 31 దేశాలకు చెందిన 250 కంపెనీలతో శ్రీసిటీ ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా నిలిచిందని లోకేష్ కొనియాడారు. క్యారియర్ సంస్థ ఇక్కడ ప్లాంట్‌తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తెలంగాణ ఇంటర్‌లో భారీ మార్పులు! ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్
తెలంగాణ ఇంటర్‌లో భారీ మార్పులు! ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్
NPS Sanchay Scheme: అసంఘటిత కార్మికులకు నెల నెలా పెన్షన్.. NPS సంచయ్ స్కీమ్ కు అర్హతలు, దరఖాస్తు విధానం ఎలా?
అసంఘటిత కార్మికులకు నెల నెలా పెన్షన్.. NPS సంచయ్ స్కీమ్ కు అర్హతలు, దరఖాస్తు విధానం ఎలా?
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు- వారానికి ఒకరోజు నో వెహికల్ డే .. ప్రధాని పిలుపుతో పొదుపు మంత్రం!
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు- వారానికి ఒకరోజు నో వెహికల్ డే .. ప్రధాని పిలుపుతో పొదుపు మంత్రం!
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Race Case: కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
IPL 2026 MI VS PBKS Result Update: పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
Arshdeep Singh Racist Comment on Tilak Varma: ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
Honda City Facelift Spied: హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ అదిరిపోయే లుక్‌తో వచ్చేస్తోంది: లాంచ్‌కు ముందే లీకైన ఫోటోలు
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ అదిరిపోయే లుక్‌తో వచ్చేస్తోంది: లాంచ్‌కు ముందే లీకైన ఫోటోలు
Memu Coplam OTT : విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Shah Rukh Khan Cadillac Escalade: షారుఖ్ ఖాన్ గ్యారేజీలోకి కొత్త లగ్జరీ కారు - ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్న అమెరికన్ బీస్ట్!
షారుఖ్ ఖాన్ గ్యారేజీలోకి కొత్త లగ్జరీ కారు - ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్న అమెరికన్ బీస్ట్!
Uttar Pradesh Storm: రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
Embed widget