Nara Bramhani :
ఇతర రాష్ట్రాల అభివృద్ధి అజెండాగా ఏపీ ప్రభుత్వం ఎందుకు పనిచేస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి నిలదీశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. సులభతర వాణిజ్యం, నైపుణ్యాభివృధ్ధి రంగాల్లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపి అందరూ గర్వపడేలా చేశారన్నారు. ఇప్పుడు అమరరాజా నుంచి లులు వరకూ ఎన్నో పరిశ్రమలు ఏపీ నుంచి తెలంగాణకు తరలిపోయాయన్నారు. ప్రస్తుతం చాలా పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్తున్నాయని బ్రాహ్మణి ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు పరిశ్రమలు ఎందుకు తరలివెళ్లిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలను అభివృద్ధి చేయడమే ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ ఎందుకు పనిచేస్తోందని ఆమె నిలదీశారు. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్‌వన్‌గా తీర్చిదిద్ది రాష్ట్ర ప్రజలు గర్వపడేలా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేశారని ఆమె పేర్కొన్నారు.
అమరరాజా, నుంచి లులూ వరకు పరిశ్రమలు వెళ్లిపోయాయని, తెలంగాణకు పెట్టుబడిదారులు వెళ్లిపోవడానికి దారితీసిన పరిస్థిలులు ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఆంధ్రపదేశ్ నుంచి తెలంగాణకు, ఇతర రాష్ట్రాలకు పరిశ్రమలు వెళ్లిపోవడంపై ది ప్రింట్ పత్రిక ప్రచురించిన కథనాన్ని బ్రాహ్మణి తన పోస్టుకు జతచేశారు.
మరో వైపు టీడీపీ పిలుపునిచ్చిన మోత మోగిద్దాం ఆన్ లైన్ సోషల్ క్యాంపెయిన్ కు కూడా నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో స్పందించాలన్నారు.