Nara Lokesh Gift To Nara Brahmani: ఏపీ సీఎం చంద్రబాబు సహా కుటుంబసభ్యులు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తన సతీమణి బ్రాహ్మణికి (Nara Brahmani) మంగళగిరి చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు. ఇక్కడి చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతమైందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ వారికి మద్దతు ఇచ్చి చేనేతను ఆదుకునే ప్రయత్నం చేయాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
బ్రాహ్మణి రిప్లై ఇదే..
లోకేశ్ పోస్టును బ్రాహ్మణి రీపోస్ట్ చేశారు. మంగళగిరి చేనేత చీర చాలా ప్రత్యేకంగా ఉందని చెబుతూ లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప నైపుణ్యంతో తీర్చిదిద్దిన చేనేత చీరను తీసుకోవడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు.